హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీడీఆర్ రాకెట్ కేసు: ఆర్మీ మాజీ కెప్టెన్ అరెస్టు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: అక్రమంగా సేకరించిన సీడీఆర్ (కాల్ డిటెయిల్స్ రికార్డు)లను వేరే వారికి విక్రయించిన కేసులో ఆర్మీకి చెందిన మాజీ అధికారితో సహ ఇద్దరిని న్యూఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

హైదరాబాద్ లో షార్ప్ డిటెక్టివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఆర్మీ మాజీ అధికారి డీకే. గిరిని అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. డీకే. గిరి ఆర్మీలో కెప్టెన్ స్థాయిలో ఉద్యోగం చేశారు.

ఓ ప్రయివేట్ విభాగం ద్వారా సైంటిఫిక్ అప్రొచెస్ తో పలు విచారణలు విజయవంతంగా చేసిన డీకే. గిరికి గతంలో రత్న షిరోమణి అవార్డు వచ్చింది. అయితే డీకే. గిరి వేరే వ్యక్తితో కలిసి అక్రమంగా కాల్ డిటెయిల్స్ సంపాధించారు.

Ex-Army man DK Giri arrested In Hyderabad

తరువాత వాటిని ఇతరులకు విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు సీడీఆర్ రాకెట్ అంటూ కేసు నమోదు చేసి ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో జైపూర్ పోలీస్ సైబర్ సెల్ లో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు.

ఈ కేసును సీనియర్ గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకుని డీకే. గిరిని అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. డీకే. గిరిని అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు దృవీకరించారు. 1978 నుంచి డీకే. గిరి హైదరాబాద్ లో డిటెక్టీవ్స్ సంస్థను నిర్వహిస్తున్నాడు.

English summary
The former Army officer, Captain D K Giri, has been running a detective agency in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X