Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజకీయాల్లో ఉండాలా.. పోవాలా.. కన్నీరు పెట్టుకున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూర్ మున్సిపాలిటీలో నేడు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతల మధ్య జరిగింది. తొర్రూరు మున్సిపాలిటీలో మెజారిటీ సాధించిన బీఆర్ఎస్, మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడంలో మాత్రం విఫలమైంది. దీంతో తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవిని పోగొట్టుకొని పరాజయం పాలైన నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

బోరున విలపించిన మాజీమంత్రి ఎర్రబెల్లి

మున్సిపల్ ఎన్నికల అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆయన్ను నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కష్టపడి పనిచేసిన గులాబీ కార్యకర్తలకు తాను ఏం సమాధానం చెప్పాలి అంటూ ఆయన బోరున విలపించారు. ఈ ఎన్నికలలో రాజ్యాంగానికి విరుద్ధంగా కార్యకలాపాలు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ex minister Errabelli dayakar rao emotional after the defeat in chairman election of torrur municipality

రాజకీయాలలో ఉండాలా వద్దా? ఎర్రబెల్లి ప్రశ్న

ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశత్వం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయాలలో ఉండాలా వద్దా అంటూ ప్రశ్నించారు.మరోవైపు, తొర్రూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. ఎంపీ కడియం కావ్యను ఎక్స్-అఫీషియో సభ్యురాలిగా అనర్హురాలిగా పేర్కొంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ తమను బెదిరించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు.

ఎన్నికను వాయిదా వేసిన అధికారులు.. తొర్రూరులో 144 సెక్షన్

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు, కాంగ్రెస్ ఏడు సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కు మద్దతుగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ సీట్లు సమానమయ్యాయి. దీంతో అధికారులు ఈ ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి తొర్రూరు పట్టణంలో 144 సెక్షన్ విధించారు.

ఉద్రిక్తతల నడుమ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ ఇరు పార్టీల కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసుకు చేరుకోగా తొర్రూర్ లో డ్రా పద్ధతిలో చైర్మన్ ను ఎంపిక చేశారు. అయితే ఈ డ్రాలో కాంగ్రెస్ పార్టీ శ్రవణ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.తొర్రూరు వైస్ చైర్మన్ గా సోమ రజిని రాజశేఖర్ డ్రా పద్ధతిలో ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక చెల్లదని ఆందోళనకు దిగిన ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ముందస్తుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+