Gangula Kamalakar: మాజీ మంత్రి గంగుల అనుచరుడికి ప్రభుత్వ జీతం..!
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ నేత బంధువుకు విద్యుత్ శాఖలో గెజిటెడ్ స్థాయి పోస్ట్ ఇప్పించారని.. సదరు మహిళ ఆఫీస్ కు రాకుండానే లక్షల్లో జీతం తీసుకుందని తీవ్ర దూమరం రేగింది. తాజాగా కరీంనగర్ ఎమ్మెల్యే కూడా ఇలాంటి పని చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ వ్యక్తికి ఉద్యోగం ఇప్పించినట్లు ప్రచారం జరగుతోంది. సదరు వ్యక్తి వేలల్లో ప్రభుత్వం నుంచి జీతం పొందిన్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ లో నారంభట్ల మహేందర్ ఓ హోటల్ కు యజమానిగా ఉన్నారు. ఇతను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. గంగుల కార్పొరేటర్ గా ఉన్నప్పటి నుంచి మహేందర్ అనుచరుడిగా కొనసాగుతున్నారు. గంగుల మహేందర్ కు ప్రభుత్వం నుంచి మూడు సంవత్సరాలు జీతం ఇప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి పేషీలో పలు సేవలు అందించేందుకు సదరు వ్యక్తిని నియమించుకున్నట్లు తెలిసింది.

కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో పలు ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం తెలంగాణ బీసీ వెల్ఫేర్ కో ఆపరేటీవ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మహేందర్ ను నియమించినట్లు చెబుతున్నారు. జీతం మాత్రం కరీంనగర్ బీసీ కార్పొరేషన్ నుంచే ఇచ్చారట. ఇవ్వడం కరీంనగర్‌లో తనతోపాటు పార్టీకోసం పనిచేసే వ్యక్తి అని జీతం ఇప్పించడంపై గంగుల కమలాకర్ పై విమర్శలు వస్తున్నాయి.
అధికారులు కూడా మంత్రి చెప్పినట్లు విని ప్రభత్వం నుంచి జీవితం ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం కరీంనగర్ లో చర్చనీయంశంగా మారింది. మహేందర్ ఇంకా జీతం తీసుకుంటున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై బీసీ కార్పొరేషన్ అధికారులు స్పందించాల్సి అవసరం ఉందని ప్రజలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications