మాజీ మంత్రికి తృటిలో తప్పిన పెను ప్రమాదం, రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
హైదరాబాద్: మాజీ మంత్రి మారెప్పకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్ నుంచి కర్నూలుకు తన అనుచరులతో కలసి ఇన్నోవా కారులో మారెప్ప వెళుతుండగా దివిటిపల్లి సమీపంలో ముందు వెళుతున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.
దీంతో, వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మారెప్పకు స్వల్ప గాయాలయ్యాయి. అదే కారులో ప్రయాణిస్తున్న మారెప్ప సోదరుడు జోజెప్ప, మాజీ ఎమ్మెల్యే దార సాంబయ్య, బీజేపీ దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాములకు ఎలాంటి గాయలు కాలేదు.
పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
కోదాడ బైపాస్‌రోడ్డుపై ఆగి ఉన్న రోడ్డురోలర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డైవర్ నిర్లక్షంవల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
సమాచారం అందుకుని సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications