కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ - బీఆర్ఎస్ ఫైర్, హోరా హోరీ..!!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార -ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ కు సవాల్ చేసారు. సీఎం ను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలన ప్రస్తావించారు. కాళేశ్వరంపై చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. సభకు రాకుండా కేసీఆర్ పారిపోయారని ధ్వజమెత్తారు. రేవంత్ భాష పైన బీఆర్ఎస్ అభ్యతరం వ్యక్తం చేసింది.
భాష పై చర్చ : శాసనసభలో సీఎం రేవంత్ భాష పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా కేసీఆర్ పారిపోయారు అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నిన్న మాట్లాడిన భాషపై చర్చ చేద్దామా అని ప్రశ్నించారు.

కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్దమని చెప్పారు. రేపు సాయంత్రం వరకైనా సమయం ఇస్తున్నామన్నారు. కేసీఆర్ సభకి వచ్చి చర్చలో పాల్గొనాలని సవాల్ చేసారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే సభకి వచ్చి చర్చ చేయాలని డిమాండ్ చేసారు. సచ్చిన పామును ఎవరైనా చంపుతారా అని ఎద్దేవా చేసారు. కేసీఆర్ పారిపోయి ఫామ్ హౌజ్‌లో దాకున్నారని మండిపడ్డారు.
రేవంత్ వ్యాఖ్యలతో : అయితే ముఖ్యంత్రి రేవంత్ భాషపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. సీఎంగా నిండు సభలో మట్లదకూడని భాష మాట్లాడటం సబబు కాదు అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై శ్వేత పత్రం విడుదల చేస్తే చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.
సీఎం భాష పట్ల తమకు అభ్యంతరం ఉందన్నారు. సీఎంగా నిండు సభలో మట్లదకూడని భాష మాట్లాడటం సబబు కాదన్నారు. సీఎం గౌరవాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు. సీఎం... రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చీడ పురుగు రాజగోపాల్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను చీట్ చేసింది రాజగోపాల్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించటంతో గందరగోళం మొదలైంది.
అసెంబ్లీ లో సీఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నాం
— BRS Party (@BRSparty) February 14, 2024
చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి.. రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు
సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ… pic.twitter.com/plN0m5yqWw
బీఆర్ఎస్ వాకౌట్ : సీఎం రేవంత్ నల్గొండలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన స్పందిస్తూ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకడానికి వెళ్ళాడు అని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ పాంటు లాగారు. ఇక జనం కేసీఆర్ చొక్కా కూడా లాగేస్తారు. సభకి రావాల్సిన నాయకుడు సభకి రాకుండా ముఖ్యమంత్రిని తిడుతాడా అంటూ సీరియస్ అయ్యారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యల పై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పక్షం నేతల భాషను నిరసిస్తూ సభ నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. సభలో ప్రభుత్వం రేపు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని పైన చర్చకు సిద్దమని బీఆర్ఎష్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications