'చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడు పోతే అంత ప్రభుత్వానికి నష్టం' (ఫోటోలు)
హైదరాబాద్: చీప్ లిక్కర్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి పద్మారావు సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టే ప్రసక్తే లేదన్నారు.
గుడుంబా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది చనిపోతున్నారని, ఈ క్రమంలో ప్రజల ఆయుష్షు పెంచడానికే సీఎం కేసీఆర్ నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చారన్నారు. గుడుంబాపై మా ప్రభుత్వం వార్ ప్రకటించిందని చెప్పిన ఆయన, ఊరూరా మద్యం అమ్ముతున్నారనేది ఆవాస్తమన్నారు.
పన్ను ఆదా తగ్గించుకొని పేదలకు తక్కువ ధరకే చీప్ లిక్కర్‌ను అందించి ఆరోగ్యాన్ని కాపాడాలన్నదే సర్కార్ లక్ష్యమన్నారు. ఒక కేసు చీప్ లిక్కర్‌పై ప్రభుత్వానికి రూ. 1800 ట్యాక్స్ వస్తుందని, దానిని రూ. 700కు తగ్గించుకుని నాణ్యమైన లిక్కర్‌ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

'చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడు పోతే అంత ప్రభుత్వానికి నష్టం'
చీప్ లిక్కర్‌ను కొత్తగా తయారు చేయడం లేదన్నారు. చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడు పోతే అంత ప్రభుత్వానికి నష్టమన్నారు. ప్రభుత్వానికి నష్టమొచ్చినా, ప్రజల ఆరోగ్యం బాగుండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో గుడుంబా కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు.

'చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడు పోతే అంత ప్రభుత్వానికి నష్టం'
30 నుంచి 35 ఏళ్ల లోపే మహిళలు వితంతువులు అవుతున్నారు. పిల్లలు అనాథలు అవుతున్నారు. గుడుంబా బారిన పడిన వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గుడుంబా నియంత్రణకు త్వరలోనే ఓ తేదీని ప్రకటిస్తామన్నారు. ఆ తర్వాత రోజుల్లో గుడుంబా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

'చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడు పోతే అంత ప్రభుత్వానికి నష్టం'
ఊరురా మద్యం షాపులు, కిరణాల్లో మద్యం అమ్ముతామని నేను కానీ, సీఎం కానీ ఎప్పుడైనా ప్రకటించారా? విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో ఏమైనా లోపాలు, తప్పులు ఉంటే నిరసన తెలపాలన్నారు. కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోక ముందే ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు ఎందుకు? అని ప్రశ్నించారు.

'చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడు పోతే అంత ప్రభుత్వానికి నష్టం'
మరికొంత మంది చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టడం వల్ల గౌడ కులస్తులు నష్టపోతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చీప్ లిక్కర్ వల్ల ఎవరూ నష్టపోరని చెప్పిన ఆయన, అందరికీ మంచే జరుగుతుందన్నారు. గౌడ కులస్తులు చనిపోతే ప్రభుత్వం రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తుందన్నారు.

'చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడు పోతే అంత ప్రభుత్వానికి నష్టం'
గౌడ కులస్తులు నష్టపోతారని అని వాదిస్తున్న కాంగ్రెస్ నేతలు గౌడ్స్‌కు ఏనాడైనా మేలు చేశారా? ప్రతిపక్షాలు నిజనిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications