మద్యం ఇక ప్యాకెట్లలో - ధరలు తగ్గింపు, కొత్త రేట్లు ఇలా..!!

మందుబాబులకు మందు మరింత సులభంగా అందనుంది. తక్కువ ధరలకే మద్యం అందు బాటు లోకి తెచ్చేలా రంగం సిద్దమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంచనాలకు మించి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఖజనాను నింపుతున్నాయి. ఇదే సమయంలో మరింత కొత్త ఆలోచన లతో అమ్మకాలు పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ సిద్దం అవుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్లకు అదనంగా కొత్త బ్రాండ్లను పరిచయం చేస్తోంది. దీంతో, పాటుగా అమ్మకాల్లో మార్పులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఫలితంగా ధరలు తగ్గనున్నాయి.

తక్కువ ధరలకే
ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాల్లో కొత్త ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఈ ప్రతిపాదనల మేరకు ధరలు తగ్గటం ద్వారా అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ఎక్సైజ్ శాఖ కర్ణాటక తరహాలో రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం ఇకఅందుబాటులోకి రానుంది. ఫ్రూట్‌ జ్యూస్‌ తరహాలో మద్యం ప్యాకెట్లను జేబులో పెట్టుకుని తీసుకెళ్లేలా 60 ఎంఎల్‌, 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ల ప్యాకెట్లను అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు. సీసాలో దొరుకుతున్న మద్యం కంటే.. టెట్రా ప్యాకెట్లలో తక్కువ ధరకు లభించనుంది. రాష్ట్రంలో ఇప్పుడు క్వార్టర్‌ చీఫ్‌ లిక్కర్‌ ధర రూ.120గా ఉంది. అదే మద్యం టెట్రా ప్యాకెట్లలోకి మారితే రూ.100లకు లభించే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలను ఎక్సైజ్‌ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు జరగనున్నాయి.

excise-officials-latest-proposals-of-branded-liquor-sales-with-low-prices

టెట్రా ప్యాకెట్లలో
రాష్ట్రంలో 2620 వైన్‌ షాపులు, 1117 వరకు బార్లున్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతుంది. కర్ణాటకలో మెక్‌డొవెల్స్‌ నంబర్‌ వన్‌ అనే కంపెనీ 90శాతం టెట్రా ప్యాకెట్లలో విక్రయాలు జరుపుతోంది. అదే విధానాన్ని రాష్ట్రంలో విక్రయించడానికి ముందుకొచ్చింది. క్వార్టర్‌ సీసాల్లో విక్రయాలు తగ్గడం, ప్యాకెట్ల విధానం కొత్తగా తీసుకరావడం వల్ల అమ్మకాలు పెంచుకోవచ్చుననే ఉద్దేశంతో ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులు రెండుసార్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న క్వార్టర్‌ బాటిల్స్‌ స్థానంలో టెట్రా ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని ... దీని వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి, వినియోగదారుడు, కంపెనీకు కలిగే ప్రయోజనాల గురించి ఆ శాఖ అధికారులతో చర్చించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఉన్న కర్ణాటకలో టెట్రా ప్యాకెట్లలో మద్యం వ్యాపారం లాభసాటిగా సాగుతున్న విషయం ప్రస్తావనకు వచ్చింది.

Take a Poll

రూ 105 కే క్వార్టర్ మద్యం
కర్ణాటకలో 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ ప్యాకెట్లు విక్రయిస్తుండగా, తెలంగాణలో వీటితోపాటు 60 ఎంఎల్‌ ప్యాకెట్లు కూడా తేవాలని ప్రతిపాదించారు. సీసా మద్యంతో పోల్చినప్పుడు టెట్రా ప్యాకెట్‌ మద్యం మందుబాబులకు రూ.10 నుంచి రూ.15 తకువ ధరకే లభిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం క్వార్టర్‌ చీప్‌ లికర్‌ ధర రూ.120 ఉన్నది. ఇదే మద్యం టెట్రా ప్యాక్‌లోకి మారితే రూ.105కే లభిస్తుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన మందుబాబులకు ఒక క్వార్టర్‌ మద్యం మీద రూ.15 మేర మిగులుతుందని వివరిస్తున్నారు. గతంలో తమిళనాడు, బీహార్‌ రాష్ట్రాల్లో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించాలని ప్రయత్నించి.. అక్కడ ఎదురైన నిరసనలతో అమలు కాలేదు. ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టుగా ముందుగా ఒక జిల్లాలో అమలు చేయాలనే ఆలోచన లో అధికారులు ఉన్నారు. ఈ టెట్రా ప్యాకెట్ అమ్మకాల పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+