హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు ఆవ‌ర‌ణ‌లో ఉద్వేగ‌భ‌రిత వాతావ‌ర‌ణం..!గంపెడు దుఖంతో వీడ్కోలు చెప్పుకుంటున్న సిబ్బంది..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/ హైద‌రాబాద్ : అది కొన్నేల్లుగా విడదీయ‌రాని అనుబంధం. ర‌క్త బంధం కన్నా, పేగుబంధం క‌న్నా ఎక్కువైంది. అదే స్నేహ బంధం. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఎంతో అన్యోన్యంగా క‌లిసిమెలిసి ఉన్న వారి ఆ ఉద్యోగులకు రాష్ట్ర విభ‌జ‌న శ‌రాఘాతంలా ప‌రిణ‌మించింది. కాని త‌ప్ప‌ని ప‌రిస్తితుల్లో భావోద్వేగాల మ‌ద్య చిర‌కాల మిత్రుల‌నుండి వీడ్కోలు చెప్పుకుంటేన్నారు ఆ ఉద్యోగులు. మొన్న సెక్ర‌టేరియ‌ట్ ఉద్యోగులు, నేడు హైకోర్టు ఉద్యోగులు.. ఏపి కి త‌ర‌లి వెళ్లే క్ర‌మంలో ఉద్యోగుల్లో అదే ఉద్వేగం, అదే ఆవేద‌న‌, అవే క‌న్నీళ్లు.. మ‌ళ్లీ క‌లుద్దాం అన్నా, మ‌ళ్లీ క‌లువు అక్కా.. బాబాయ్ వెళ్తున్నాం అంటూ గంపెడు దుఖంతో హైకోర్టు ఉద్యోగులు ఏపికి త‌ర‌లి వెళ్తున్న ద్రుశ్యాలు నిజంగా మ‌న‌సును గాయం చేసేలా క‌నిపించాయి.

 స్నేహానిక‌న్న‌మిన్న లోకాన‌ లేదురా..! వీడ్కోలు సంద‌ర్బంగా హైకోర్టు ఉద్యోగుల ఆవేద‌న‌..!!

స్నేహానిక‌న్న‌మిన్న లోకాన‌ లేదురా..! వీడ్కోలు సంద‌ర్బంగా హైకోర్టు ఉద్యోగుల ఆవేద‌న‌..!!

నేటి సాయంత్రం 4 గంటలకు అమరావతి కి హైకోర్టు జడ్జిలు చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులతో సిబ్బంది, వస్తువులు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ హైకోర్టు ఆవరణలో తెలంగాణ, ఏపీ న్యాయవాదులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ ఉద్యోగులు భావోద్యేగానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యోగులు, న్యాయవాదులు ఏపీ ఉద్యోగులకు వీడ్కోలు చెప్పారు. హైకోర్టు నుంచి ఐదు బస్సులు బయలుదేరి వెళ్లాయి. 900 మంది ఉద్యోగులు ఏపీ కోర్టులలో విధులు నిర్వర్తిస్తున్నారు.

 మొన్న స‌చివాల‌యం..! నేడు హైకోర్ట్ ఆవ‌ర‌ణ‌..! అదే భావోద్వేగం..! అదే దుఖం..!!

మొన్న స‌చివాల‌యం..! నేడు హైకోర్ట్ ఆవ‌ర‌ణ‌..! అదే భావోద్వేగం..! అదే దుఖం..!!

హైదరాబాద్ నుంచి వచ్చే హైకోర్టు న్యాయమూర్తులకు ఏపీ ప్రభుత్వ అధికారులు స్వాగతం పలకనున్నారు. న్యాయమూర్తులకు విజయవాడ లోని హోటల్లో బస కు ఏర్పాట్లు చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 10.30.గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాగరి ప్రవీణ్ కుమార్ రెడ్డి, న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ ఈఎస్ఎల్. చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు రానుండడంతో స్టేడియంలో రెండు మూడు రోజులులు ముస్తాబు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

విడ‌దీయ‌రాని బంధం స్నేహం ఒక్క‌టే..! విడిపోవ‌డం అంటే న‌ర‌క‌మే..!!

విడ‌దీయ‌రాని బంధం స్నేహం ఒక్క‌టే..! విడిపోవ‌డం అంటే న‌ర‌క‌మే..!!

హైకోర్టులో లాయర్లు, సిబ్బంది హడావుడి నెలకొంది. సిబ్బంది, ఫైళ్లను తరలించేందుకు 10 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఏపీ లాయర్లకు.. తెలంగాణ లాయర్లు వీడ్కోలు పలుకుతున్నారు. మంగళవారం ఉదయం 8.30కి తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా... జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు ఉ. 11.30కి ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

విభ‌జ‌న‌తో విడిపోతున్న ఉద్యోగులు..! వెళ్ల‌లేక వెళ్లి పోతున్న ఏపి ఉద్యోగులు..!!

విభ‌జ‌న‌తో విడిపోతున్న ఉద్యోగులు..! వెళ్ల‌లేక వెళ్లి పోతున్న ఏపి ఉద్యోగులు..!!

ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు కార్యకలాపాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జిలు, అధికారుల వసతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 1వ తేదీన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, ఇతర జడ్జిల ప్రమాణ స్వీకారానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. హైకోర్టు కార్యాలయం కోసం ఎంజీ రోడ్డులోని ఏపీఏటీ భవనంలో 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిలో ఫర్నీచర్‌ సమకూర్చాలని సీఆర్‌డీఏను ఆదేశించారు. హైకోర్టు కార్యకలాపాలకు అవసరమైన కంప్యూటర్లను సమకూర్చాలని ఐటీ శాఖను ఆదేశించారు. హైకోర్టు జడ్జిలు, రిజిస్ర్టార్లకు నోవోటెల్‌ హోటల్‌లో వసతి ఏర్పాటు చేయాలని ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఇతర న్యాయ శాఖ అధికారులకు స్టేట్‌ గెస్ట్‌హౌస్ లో వసతి ఏర్పాటు చేయనున్నారు.

English summary
It's an inseparable affair. More than blood relationship, That friendship is the same. The division of the state to those employees who have come together for a number of years has come to an end. But those are the employees who say goodbye from the long-time friends of the emotions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X