కాచిగూడ- బెంగళూరు వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ప్రయాణికుల నుంచి లభిస్తోన్న అపూర్వ ఆదరణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌లో కీలక మార్పులను తీసుకుని రానుంది. వారికి మరింత అనుకూలంగా తీర్చిదిద్దుతోంది. కొత్తగా స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకుని రావడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
కాచిగూడ నుంచి బెంగళూరు (యశ్వంత్ పూర్) మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై మరో తాజా సమాచారం వెలువడింది. ఈ ఎక్స్ ప్రెస్ కు కొత్తగా హిందూపురం హాల్ట్ సౌకర్యం లభించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ సహాయమంత్రి వీ సోమణ్ణ వెల్లడించారు. ప్రయాణికుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇకపై కాచిగూడ- యశ్వంత్ పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్.. హిందూపురంలో ఆగుతుంది. ప్రస్తుతం ఈ రైలు అయిదు స్టేషన్లల్లో మాత్రమే హాల్ట్ అవుతున్న విషయం తెలిసిందే. కాచిగూడ నుంచి బయలుదేరిన తర్వాత మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరంలల్లో హాల్ట్ అవుతోంది. ఈ జాబితాలో కొత్తగా హిందూపురం కూడా వచ్చి చేరింది.
The long-standing demand for a stoppage of the Kacheguda-Bengaluru Vande Bharat Express at Hindupur has finally been approved.
— V. Somanna (@VSOMANNA_BJP) August 18, 2025
This enhances connectivity to Sathya Sai Ashram, Puttaparthi, and benefits the region's manufacturing, pharmaceutical, automobile, and IT industries.…
బుధవారం మినహాయించి ప్రతి రోజూ తెల్లవారు జామున 5:45 నిమిషాలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 20703 వందే భారత్.. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 2:45 నిమిషాలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరే నంబర్ 20704 వందే భారత్.. రాత్రి 11 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications