'మంజుమ్మెల్ బాయ్స్' గుహలు.. హైదరాబాద్ కు దగ్గర్లోనే.. ఎలా వెళ్లాలి..?

చాలామందికి కొండ గుహల్లో విహరించాలని ఉంటుంది. గుహల్లో ప్రయాణం ఎంతో సాహసోపేతంగా ఉంటుంది. అందుకే గుహలను సందర్శించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. కొండల నడుమ గుహలు, సొరంగాలు చూస్తూ వావ్ అని ఫీల్ అవుతుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ గుహలు చాలా ప్రత్యేకతను చాటుకున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన ఇక్కడి అందాలు పర్యటకులను మైమరిపింపజేస్తున్నాయి. మరి ఈ గుహలు ఎక్కడ ఉన్నాయి. ఎలా చేరుకోవాలి..?

Exploreuch Explore the Mysterious Billa Surgam Caves of Kurnool

ఏపీలోని కర్నూలు సమీపంలోని బేతంచర్ల వద్ద ఈ సహజ సిద్దమైన గుహలు ఏర్పడ్డాయి. వీటిని బిల్లా సుర్గం గుహలు అని పిలుస్తుంటారు. ఈ గుహలు లైమ్ స్టోన్ అనే మినరల్ తో ఎన్నో వేల సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడినట్లు పరిశోధకులు చెబుతారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ గుహలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఇటీవల సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో చాలా మంది ఫ్యామిలీస్ తో కలిసి ఈ గుహలను వీక్షించేందుకు వస్తున్నారు.

వేల క్రితం నుంచి లైమ్ స్టోన్ మినరల్ క్రమంగా ఇంకిపోవడం మూలంగా ఇలా గుహలు ఏర్పడ్డాయి. ఇవి ఓ వైపు ఓపెన్ గా మరోవైపు క్లోజ్ గా ఉంటూ అచ్చం మానవ నిర్మితమైనవిగా కనిపిస్తాయి. ఈస్టర్న్ ఘాట్స్ లోని ఎర్రమలై కొండల్లో ఈ గుహలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ గుహలను ఏపీ టూరిజం కింద సంరక్షిస్తోంది. వీటికి 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తొలిసారిగా ఈ గుహలను 18వ శతాబ్దంలో ఆంగ్లేయులు గుర్తించారు. ఆ తర్వాత ఇవి వాడుకలోకి వచ్చాయి. ఇక్కడ ఆదిమానవులకు సంబంధించిన పరికరాలు చాలానే ఉన్నాయి. సందర్శకుల కోసం వీటిని భద్రపరిచారు.

ఈ బిల్లా సుర్గం గుహలు హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని బేతంచర్ల మండలంలో ఈ గుహలు ఉన్నాయి. ఈ గుహలకు చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి ఎన్ హెచ్ 44 మీదుగా కర్నూల్ చేరుకోవాలి. ఆ తర్వాత కర్నూల్ నుంచి ఎన్ హెచ్ 40 మీదుగా బేతంచెర్ల చేరుకోవాలి. బేతంచెర్ల నుంచి గుహలు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఐదారు గంటల్లో వీటిని చేరుకోవచ్చు. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ లో గుహలు ఉంటాయిగా.. సేమ్ అలానే ఈ గుహలు కూడా ఉంటాయి. దీంతో అక్కడి యువత వీటిని మంజుమ్మెల్ బాయ్స్ గుహలు అంటుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+