వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమె పేరున సిమ్: పెళ్లికి అడ్డుస్తొందని ప్రేయసి హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Extra marital relation leads to murder
నల్లగొండ: నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎస్‌ లింగోటం శివారులో మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌ చేశారు. గురువారం పోలీసుస్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో హత్యకేసు సంబం ధించిన వివరాలను సీఐ గట్టు మల్లు వెల్లడించారు.

చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన గంగి రెడ్డి రాజశేఖర్‌రెడ్డి(22) వ్యవసాయం చేసుకుంటూ వరికోత మిషన్‌ను కొనుగోలు చేసి నడుపుతున్నాడు. రామన్నపేట మండలంలో వరికోత మిషన్‌ను నడుపుతుండగా కూలీ పనిచేసే కక్కిరేణికి చెందిన నల్ల నీల్లమ్మ(30)తో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. సంవత్సరం నుంచి ఈ తతంగం కొనసాగుతోంది. నీలమ్మకు డబ్బులు సైతం సమకూర్చేవాడు.

ఇటీవల రాజశేఖర్‌రెడ్డికి పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. విషయం తెలిసిన నీలమ్మ రాజశేఖర్‌రెడ్డిని పెళ్లి చేసుకోవద్దని వేధించసాగింది. తనను కాదని పెళ్లిచేసుకుంటే పరువు తీస్తానని బెదిరించింది. దీంతో రాజశేఖర్‌రెడ్డి నీలమ్మపై పగను పెం చుకుని, వేధిస్తున్న నీలమ్మను హత్య చేయాలని పథకం వేశాడు. నెల రోజుల క్రితం నీలమ్మ గుర్తింపుకార్డుతో సిమ్‌ను కొనుగొలు చేసి,ఆ సిమ్‌తోనే నీలమ్మతో మాట్లాడేవాడు. ప్రేమగా నటించాడు.

ఈ నేపథ్యంలో దసరా పండుగకు నీలమ్మ స్వగ్రామం నార్కట్‌పల్లి మండలం చిన్నతుమ్మలగూడెంకు వచ్చింది. చీరలు కొనిస్తానని చౌటుప్పల్‌కు రమ్మని ఫోన్‌ చేశాడు. ఈ నెల 2న చౌటుప్పల్‌కు చేరుకొన్న ఆమెను బైక్‌పై ఎస్‌ .లింగోటం శివారులోకి తీసుకెళ్లి గొంతు నలిమి చంపేశాడు. పక్కనే ఉన్న బండరాయితో తలపైబాది హత్య చేశాడు. ఆమె ధరించిన బంగారుకమ్మలు, పట్టాగొలుసులు తీసుకొని బైక్‌పై పరారయ్యాడు. మృతదేహన్ని ఈ నెల 4న పోలీసులు గుర్తించి దర్యాప్తు కొనసాగించారు.

ఈ నెల 7న రామన్నపేటలో నీలమ్మ మిస్సింగ్‌ కేసు నమోదైంది. మిస్సింగ్‌లపై విచారణ నిర్వహించిన పోలీసులు ఎస్‌ లింగోటంలో హత్యకు గురైంది నీలమ్మగా గుర్తించారు. హత్యకు కారణలను దర్యాప్తు చేయస్తుండగా రాజశేఖర్‌రెడ్డితో నీలమ్మకు ఉన్న సంబంధం తెలిసింది. రాజశేఖర్‌రెడ్డిని ఆదుపులో తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

అతడి వద్ద నుంచి బైక్‌, సెల్‌ఫోన్‌లు బంగారు కమ్మలు, పట్టాగొలుసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం అరెస్టు చేసి రామన్నపేట కోర్టుకు రిమాండ్‌ చేశారు. కేసు మిస్టరీని చేధించడంలో సహకరించిన ఎస్‌ఐ హరిబాబు, మల్లేశ్వరి, సిబ్బంది యుగేందర్‌రెడ్డి, సైదులు, క్రాంతిలను సీఐ గట్టు మల్లు అభినందించారు.

English summary
A person Rajasekhar Reddy has killed his lover, as she opposed marriage with other girl in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X