వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాటింగ్‌తో వల.. 5లక్షలు గుంజాడు: యువతి ఫిర్యాదుతో అరెస్టు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సోషల్ మీడియా మోసాలు పెరిగిపోతున్నాయి. చాటింగ్ లతో యువతులకు దగ్గరవడం.. ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడం లాంటి ఘటనలు ఈమధ్య కాలంలో విపరీతంగా పెరిగాయి.

తాజాగా సికింద్రాబాద్ లోని చిలకలగూడలో ఇలాంటి ఉదంతమే బయటపడింది. చిలకలగూడలో నివాసముంటూ బిటెక్ చదువుతోన్న ఆకాశ్ రెడ్డి అనే యువకుడు.. ఫేస్ బుక్ ద్వారా ఓ యువతికి గాలమేశాడు. అమాయకంగా అతన్ని నమ్మిన యువతి అతనితో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. అలా కొన్ని రోజులు ఇద్దరి మధ్య ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ నడిచాక.. ఆమెను లొంగదీసుకోవాలని చూశాడు ఆకాశ్.

Facebook cheating : Btech student harassed a girl

ఇందుకోసం ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. దీంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో అతగాడికి రూ.5లక్షలు సమర్పించుకుంది యువతి. అక్కడితో అతగాడి వేధింపులకు ఫుల్ స్టాప్ పడుతుందని భావించిన యువతికి ఆ తర్వాత మళ్లీ వేధింపులు మొదలవడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో దిక్కు తోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకుంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆకాశ్ రెడ్డిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

English summary
Akash reddy A btech student who was chilakalaguda resident harassed a girl in facebook for money.Already he taken 5lakhs from that girl by blackmailing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X