ఫేస్‌బుక్ లేడీ ట్రాప్ లో దాదాపు రూ.15 కోట్లు పోగొట్టుకున్న హైదరాబాద్ డాక్టర్!

హైదరాబాద్ నగరంలో ఒక అవాక్కయ్యే సైబర్ మోసం వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ అపరిచిత మహిళ మాటలను గుడ్డిగా నమ్మిన ఎర్రగడ్డకు చెందిన 44 ఏళ్ల వైద్యుడు ఏకంగా రూ.14.61 కోట్లను పొగొట్టుకున్నాడు.

కొద్దిరోజుల క్రితం బాధితుడికి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మోనిక అనే పేరుతో ఒక మహిళ పరిచయమైంది. కొద్దిరోజులు సాధారణంగా మాట్లాడి ఆ మహిళ అతని నమ్మకాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అనతికాలంలోనే భారీ ఆదాయం సంపాదించవచ్చని ఆశచూపింది. ఆమె పంపిన ఒక లింక్ ఆధారంగా సదరు డాక్టర్ ఒక నకిలీ ట్రేడింగ్ వేదికపై ఖాతా తెరవడం జరిగింది.

Facebook Trading Scam Hyderabad Doctor Loses 14 61 Crore in Facebook Trading Scam After Selling House

ప్రారంభంలో ఆయన పెట్టిన స్వల్ప పెట్టుబడులకు స్క్రీన్‌పై భారీగా లాభాలు కనిపిస్తుండడంతో, అది నిజమైన ట్రేడింగ్ యాప్ అని నమ్మాడు. విడతల వారీగా కోట్లాది రూపాయలను నేరగాళ్లు సూచించిన వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు మళ్లించాడు. ఒకానొక సమయంలో ఆయన యాప్ వాలెట్‌లో సుమారు రూ.34 కోట్ల లాభం ఉన్నట్లు చూపించారు.

దాంతో మోసగాళ్ల మాయలో పూర్తిగా చిక్కుకున్న వైద్యుడు, తన చేతిలో ఉన్న సొమ్ముతో పాటు చివరకు తన నివాస గృహాన్ని కూడా విక్రయించి మొత్తం రూ. 14.61 కోట్లను ఇన్వెస్ట్ చేశాడు.
అయితే ఆ తర్వాత ఆ సొమ్మును, వచ్చిన లాభాలను తన సొంత బ్యాంక్ ఖాతాలోకి డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా అసలు చిక్కు వచ్చిపడింది. సైబర్ నేరగాళ్లు పన్నులు, టెక్నికల్ ఛార్జీలు అంటూ మరిన్ని కోట్లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు.

రైతుల నోట్లో మట్టి కొట్టే కేంద్ర నిర్ణయం - మంత్రి తుమ్మల ఆగ్రహం!
రైతుల నోట్లో మట్టి కొట్టే కేంద్ర నిర్ణయం - మంత్రి తుమ్మల ఆగ్రహం!

తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను ఆశ్రయించాడు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిధులు మళ్లించిన బ్యాంక్ ఖాతాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.అపరిచిత వ్యక్తులు పంపే ట్రేడింగ్, క్రిప్టో లేదా పార్ట్ టైమ్ జాబ్ లింకులను అస్సలు క్లిక్ చేయవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే 1930 ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+