
నకిలీ కాల్ సెంటర్ దందా.. గూగుల్ కు నోటీసులు జారీ చెయ్యనున్న సైబర్ క్రైం!!
నకిలీ కాల్ సెంటర్ తో బ్రాండెడ్ కంపెనీల వినియోగదారులను మోసం చేసిన ఘటన రామంతపూర్ లో చోటుచేసుకుంది. ప్రముఖ కంపెనీల సర్వీస్ సెంటర్ పేరుతో రెండేళ్లపాటు నకిలీ కాల్ సెంటర్ నడిపిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. అసలు ఈ నకిలీ కాల్ సెంటర్ కు, గూగుల్ కి ఉన్న సంబంధం ఏమిటి అంటే..

నకిలీ కాల్ సెంటర్.. బ్రాండెడ్ కంపెనీల సర్వీస్ సెంటర్ల పేరుతో దందా
రామంతపూర్ లో రెండు సంవత్సరాలుగా మహమ్మద్ సలీం, మొహమద్ ఆరిఫ్ అనే వ్యక్తులు నకిలీ కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. గూగుల్లో బ్రాండెడ్ కంపెనీల సర్వీసింగ్ సెంటర్ పేరుతో ప్రకటనలు ఇచ్చిన వీరు, ఏకంగా గూగుల్ మ్యాప్ లో అసలైన సర్వీసింగ్ సెంటర్ చిరునామాలు మార్చేశారు. దీంతో వినియోగదారులు అసలు సర్వీసింగ్ సెంటర్ లకు కాల్ చేయకుండా, గూగుల్ మ్యాప్ లో మార్చబడిన సర్వీసింగ్ సెంటర్ లకు కాల్ చేసేవారు. ఇక అక్కడే అసలు కథ మొదలు పెట్టేవారు నకిలీ కాల్ సెంటర్ నిర్వాహకులు.

గూగుల్ యాడ్ స్పేస్ ద్వారా ఫేక్ సర్వీస్ సెంటర్ లు, సెర్చ్ లో మొదట కనిపించేలా మోసం
వినియోగదారుల ఇంటికి టెక్నీషియన్లను పంపించి ఆయా వస్తువులు పాడయ్యాయని వాటి స్థానంలో కంపెనీ వస్తువులనే వాడాలని నమ్మించి నకిలీ వస్తువులను అంటగట్టేవారు. ఇక వచ్చిన దాంట్లో కాల్ సెంటర్ నిర్వాహకుడికి 60 శాతం, టెక్నీషియన్ 40 శాతం పంచుకునేవారు. 30 మంది టెలికాలర్ లతో రామంతపూర్ కేంద్రంగా నడిపిన ఈ సెంటర్ గూగుల్ యాడ్ స్పేస్ కొనుగోలు చేసి కృత్రిమ హిట్స్, క్లిక్ ద్వారా తాను సృష్టించిన ఫేక్ సర్వీస్ సెంటర్ లు సెర్చ్ లో మొదట కనిపించేలా చేసేవారు.

గూగుల్ మ్యాప్స్ లో బ్రాండెడ్ సంస్థల అడ్రెస్ ల మార్పు.. గూగుల్ కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం
గూగుల్
యాడ్
స్పేస్
కేంద్రంగా
నిర్వహించిన
ఈ
దందాను
గుర్తించిన
సైబర్
క్రైమ్
పోలీసులు,
గూగుల్
మ్యాప్స్
లో
లొకేషన్స్
ని
మార్చడం
ఎలా
సాధ్యమైంది
అన్నదానిపై
దృష్టిసారించారు.
ఈ
క్రమంలోనే
గూగుల్
లోని
యాడ్స్
స్పేస్
నిర్వహణ
చేసే
ఉద్యోగులు,
సాంకేతిక
నిపుణులను
విచారించాలని
నిర్ణయం
తీసుకున్నారు.
ఇక
ఈ
ఘటనను
సీరియస్
గా
తీసుకున్న
సైబర్
క్రైమ్
పోలీసులు
దీనిపై
లోతుగా
దర్యాప్తు
చేస్తున్నారు.

గూగుల్ సంస్థ యాడ్ స్పేస్ నిర్వాహకులను విచారించటానికి నోటీసులు
మార్కెట్ లో వెయ్యి రూపాయలు విలువ ఉన్న వస్తువులను తెచ్చి, బ్రాండెడ్ పేరుతో నకిలీ వాటిని 6 వేల వరకు కస్టమర్ల వద్ద నుండి వసూలు చేసి దందాకు పాల్పడినట్టు సైబర్ క్రైమ్స్ ఏసిపి కె వి ఎం ప్రసాద్ తెలిపారు. అంతేకాదు గతంలోనూ ఈ ముఠా ఇటువంటి నేరాలకు పాల్పడి పోలీసులకు పట్టుబడిందని, తిరిగి మళ్లీ ఇదే దందా కొనసాగిస్తుందని ఏసీపీ వివరించారు. ఇక తాజాగా వీరి వద్ద నుండి 555 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపిన ఆయన, నిందితులను విచారించడం కోసం కస్టడీ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే గూగుల్ కు సైతం నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు సైబర్ క్రైమ్ పోలీసులు.