హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ కరెన్సీ చలామణి గ్యాంగ్ అరెస్ట్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వ్యక్తులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో అదనపు డిసిపి కోటిరెడ్డి వివరాలను మీడియాకు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇస్మాయిల్ మహేశ్వరంలో నివసించే తన సోదరుడి వద్దకు కొన్నేళ్ల క్రితం వచ్చాడు. చిన్న చిన్న పనులు చేస్తూ సోదరుడి వద్దే ఉంటున్నాడు.

రెండేళ్ల కిత్రం అక్కడి నుంచి తన నివాసాన్ని కందుకూర్ మండలంలోని పులిమామిడికి మార్చాడు. తరచూ తన స్వగ్రామానికి వెళ్లే క్రమంలో ఐదు నెలల క్రితం నకిలీ కరెన్సీ సరఫరా చేసే ప్యార మమమూద్ అలియాస్ పప్పుతో అతడికి స్నేహం ఏర్పడింది. అసలు కరెన్సీకి అధిక మొత్తంలో నకిలీ కరెన్సీని అందించడానికి ఇద్దరు ఒప్పదం చేసుకున్నారు.

రెండు నెలల క్రితం ఇస్మాయిల్‌కు మమమూద్ 5 లక్షల నకిలీ కరెన్సీని అందించి, దాన్ని చలామణి చేయాలని సూచించాడు. దీంతో అతడు ఆ కరెన్సీని నగరంలోని వివిధ పెట్రోల్ పంపుల్లో మార్చాడు. వారం క్రితం మరో 8 లక్షల నకిలీ కరెన్సీని విజయవాడలో ఇస్మాయిల్‌కు అందించాడు. వాటిని తీసుకుని నగరానికి వచ్చిన ఇస్మాయిల్ తన గదిలో భద్రపర్చుకున్నాడు.

మంగళవారం ఉదయం అనుమానాస్పదంగా కేశవగిరి ప్రాంతంలోని దక్కన్ హోటల్ సమీపంలో సంచరిస్తున్న ఇస్మాయిల్‌తోపాటు అజాం, హనీఫ్, ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించగా నకిలీ కరెన్సీని చలామణి విషయం బయటపడింది. నిందితుల వద్ద నుండి 2లక్షల నలభై వేల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

సోహెల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు మరో 2లక్షలకుపైగా నగదు దొరికింది. ప్రధాన నిందితుడు ప్యార మహమూద్ పరారీలో ఉన్నట్లు డిసిపి తెలిపారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లతోపాటు ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మీడియా సమావేశంలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్‌టాకూర్ సుఖ్‌దేవ్‌సింగ్, చంద్రయాణగుట్ట ఇన్‌స్పెక్టర్ రామరావు, ఎస్సైలు గౌస్ ఖాన్, జి.మల్లేష్, కె.మల్లేష్, డి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

నకిలీ కరెన్సీ

నకిలీ కరెన్సీ

నకిలీ కరెన్సీ చలామణి చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ కరెన్సీ

నకిలీ కరెన్సీ

టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో అదనపు డిసిపి కోటిరెడ్డి తెలిపిన మీడియాకు వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇస్మాయిల్ మహేశ్వరంలో నివసించే తన సోదరుడి వద్దకు కొన్నేళ్ల క్రితం వచ్చాడు. చిన్న చిన్న పనులు చేస్తూ సోదరుడి వద్దే ఉంటున్నాడు.

నకిలీ కరెన్సీ

నకిలీ కరెన్సీ

రెండేళ్ల కిత్రం అక్కడి నుంచి తన నివాసాన్ని కందుకూర్ మండలంలోని పులిమామిడికి మార్చాడు.

నకిలీ కరెన్సీ

నకిలీ కరెన్సీ


తరచూ తన స్వగ్రామానికి వెళ్లే క్రమంలో ఐదు నెలల క్రితం నకిలీ కరెన్సీ సరఫరా చేసే ప్యార మమమూద్ అలియాస్ పప్పుతో అతడికి స్నేహం ఏర్పడింది. అసలు కరెన్సీకి అధిక మొత్తంలో నకిలీ కరెన్సీని అందించడానికి ఇద్దరు ఒప్పదం చేసుకున్నారు.

English summary
Fake currency gang arrested in Hyderabad by taskforce police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X