కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫింగర్ ప్రింట్స్ స్కాం: పోలీస్ కస్టడీకి నిందితుడు సంతోష్ కుమార్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సిమ్‌కార్డుల అమ్మకాల్లో టార్గెట్‌ను చేరుకోవడానికి నకిలీ వేలిముద్రలు తయారు చేసిన నిందితుడిని విచారణ నిమిత్తం పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్‌ వొడాఫోన్‌ ప్రీ-పెయిడ్‌ కనెక్షన్స్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు.

కాగా, రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ నుంచి సేకరించిన వేలిముద్రలకు నకిలీ వేలిముద్రలు తయారు చేసి సంతోష్‌కుమార్‌ దాదాపు ఆరువేల సిమ్‌కార్డులు ఆక్టివేషన్‌ చేశాడు. అయితే, ప్రాథమిక విచారణలో సిమ్‌కార్డుల విక్రయానికి సంబంధించిన టార్గెట్‌ను పూర్తిచేయడానికే నకిలీ వేలిముద్రలు తయారు చేసినట్టు బయడపడినా.. ఎవరైనా సంఘవిద్రోహ శక్తులకు అతను సిమ్‌కార్డులు అందించాడా? ఈ నకిలీ వేలిముద్రల తయారీ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో లోతుగా విచారణ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

fake finger prints scam: accused santhosh kumar for police custody

వేల సంఖ్యలో నకిలీ వేలిముద్రల స్కాం బయటపడడం ఆధార్‌ బయోమెట్రిక్‌ భద్రతకు సవాల్‌గా నిలిచింది. ఈ క్రమంలో, ఆధార్‌ బయోమెట్రిక్‌ వ్యవస్థలో వెలుగుచూసిన లోపాలను సరిదిద్దేందుకు యూఐడీఏఐ అధికారులు రంగంలోకి దిగారు.

ఇప్పటికే వరకు 1400 సెర్టిఫైడ్ డాక్యుమెంట్లు నిందితుడు తయారు చేసినట్లు సమాచారం. 3వేలకు పైగా వేలిముద్రలను సేకరించి, 3-4వేల వరకు సిమ్ లను యాక్టివేట్ చేశాడని తెలిసింది. కాగా, కోర్టు అనుమతితో సంతోష్ కుమార్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

English summary
Accused Santhosh Kumar for Police custody in fake finger prints scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X