హైకోర్టు జడ్జీనంటూ లక్షలు కాజేశాడు

హైదరాబాద్: ఇప్పటి వరకు నకిలీ పోలీసులు, నకిలీ డాక్టర్లనే చూశాం. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు ఏకంగా నకిలీ జడ్జీగా అవతారమెత్తాడు. అమాయక ప్రజలను మోసం చేస్తూ తిరుగుతున్న ఆ నకిలీ జడ్జీని కటకటాల వెనక్కినెట్టారు పోలీసులు. అతడి గన్‌మెన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు తెలిపారు.

ఘటనకు సంబంధించి మల్కాజిగిరి డీసీపీ జానకి తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ అనే వ్యక్తి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉండేవాడు. గతంలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు, వాహనాలు దొంగతనాలు చేశాడు. దీంతో నరేందర్‌పై 2017లోనే పీడీ యాక్ట్ కూడా నమోదైంది.

Fake judge

అయినా, తన నేర ప్రవృత్తి మార్చుకోకుండా అదే బాటలో కొనసాగాడు. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీలో పనిచేసిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని తనకు గన్‌మెన్‌గా నియమించుకున్నాడు నరేందర్. ఒక నకిలీ వెబ్‌సైట్ తయారు చేయించుకుని.. ప్రజలకు హైకోర్టు జడ్జీగా చెబుతూ మోసం చేస్తున్నాడు. భూ తగాదాలు, సమస్యలు ఏవైనా తాను పరిష్కరిస్తానంటూ నకిలీ వెబ్‌సైట్ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు.

ఇలా చాలా మంది వద్ద రూ. లక్షలు వసూలు చేస్తున్నాడు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్‌జడ్జిగా తిరుగుతున్న నరేందర్‌ను ఇటీవల ఖమ్మంలో అరెస్ట్ చేశారు. దీంతో జైలు నుంచి బయటికి వచ్చిన నరేందర్.. హైదరాబాద్‌కు మకాం మార్చాడు. హైదరాబాద్ నగరంలో అడిషనల్ సివిల్ జడ్జీగా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే తొర్రూర్‌కు చెందిన సోమిరెడ్డి అనే వ్యక్తి ల్యాండ్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి.. అతడి వద్ద నుంచి నరేందర్ రూ. 10 లక్షలు వసూలు చేశాడు.

తన భూ సమస్యను పరిష్కరించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరేందర్‌ను విచారించడంతో నకిలీ జడ్జీ అని తేలింది. దీంతో నరేందర్‌ను, అతని గన్‌మెన్ మధుసూదన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక తుపాకి, 5బుల్లెట్లు, ఒక కారు, ఒక మొబైల్, నగదు, నకిలీ విజిటింగ్ కార్డ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+