లూజ్ పన్నీర్ కొంటున్నారా? ఇది తెలిస్తే మీరు చచ్చినా బయట పన్నీర్ కొనరు!

ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ఆహార కల్తీ దందాపై హైదరాబాద్ పోలీసులు తీవ్ర స్థాయిలో చర్యలు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఐపీఎస్ నేతృత్వంలోని హెచ్-ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీం పోలీసులు మార్కెట్‌లో ప్రజలకు విక్రయాలు జరుపుతున్న కల్తీ పన్నీర్ కు సంబంధించి తయారీ, సరఫరా నెట్‌వర్క్‌పై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి నకిలీ పన్నీర్

ఈ ఆపరేషన్‌లో సుమారు 825 కేజీల కల్తీ పన్నీర్ పట్టుబడింది. మొత్తం 45 అవుట్‌లెట్లు మరియు 8 తయారీ యూనిట్లపై ముమ్మర తనిఖీలు చేపట్టిన హెచ్ ఫాస్ట్ . కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ నకిలీ పన్నీర్ సరఫరా అవుతోందని గుర్తించారు. వ్యాపారులు 'చీజ్ అనలాగ్'ను పన్నీర్‌గా మార్చి, 'ఫ్రెష్ పన్నీర్', 'ప్రీమియం పన్నీర్' లేబుళ్లతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారని గుర్తించారు.

fake paneer caught by H- FAST police in hyderabad seized 825 kg of adulterated paneer in major raids

గుట్టు చప్పుడు కాకుండా దందా

ఎటువంటి FSSAI లైసెన్సులు, నాణ్యత లేబుళ్లు, ఎక్స్‌పైరీ డేట్లు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా సాగుతోంది.పోలీసు ఆధారాల ప్రకారం, ఈ కల్తీ పన్నీర్‌లో పిండిపదార్థాలు, నాణ్యత లేని సింథటిక్ పాలు, ప్రమాదకర రసాయనాలు ఉపయోగించారు. ఇలాంటి నకిలీ ఉత్పత్తులు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు, జీర్ణ సమస్యలు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవ్వవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విడిగా అమ్మే లూజ్ పన్నీర్‌ను కొనొద్దు

ప్రత్యేకించి పండగల సీజన్‌లో హోటల్స్, క్యాటరింగ్ సెంటర్లు, చిన్న చిన్న దుకాణాల ద్వారా ఈ సరుకు విస్తృతంగా అందుబాటులోకి వస్తోంది. డీసీపీ వైభవ్ గైక్వాడ్ మాట్లాడుతూ, "ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్-ఫాస్ట్ టీం నిరంతరం పని చేస్తోందన్నారు. పన్నీర్ కొనేటప్పుడు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ ఉన్న వ్యాపారుల నుంచి మాత్రమే కొనాలన్నారు. విడిగా అమ్మే లూజ్ పన్నీర్‌ను పూర్తిగా నివారించాలి" అని సూచించారు.

మధిర కేంద్రంగా రైతులకు పండుగ.. మీ ఖాతాల్లో నగదు జమకు ముహూర్తం ఫిక్స్!
మధిర కేంద్రంగా రైతులకు పండుగ.. మీ ఖాతాల్లో నగదు జమకు ముహూర్తం ఫిక్స్!

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ ఘటన నేపధ్యంలో పోలీసులు మరిన్ని దాడులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, లైసెన్స్ లేని ఉత్పత్తులపై పోలీసులను అప్రమత్తం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసు నగరంలో ఆహార కల్తీ మాఫియా ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+