బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని సవతి తల్లి కట్టుకథ: ప్రత్యూష, ఆస్తి కోసమే!

హైదరాబాద్: తన సవతి తల్లి తనను తీవ్రంగా హింసించేదని, తన తండ్రి చూసి కూడా ఏం మాట్లాడకపోయేవాడని ప్రత్యూష శుక్రవారం నాడు ఓ టీవీ ఛానల్‌తో చెప్పారు. తనకు సరైన తిండి పెట్టేది కాదని చెప్పారు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కట్టుకథలు చెప్పేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తన తండ్రి ఒక్క మాట మాట్లాడకపోయేవాడని చెప్పారు. తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించిందని చెప్పారు. ఒంటి పైన వాతలు పెట్టి, కారం పెట్టేదన్నారు.

కన్న కూతురి పట్ల ఓ తండ్రి అత్యంత కిరాకతకంగా వ్యవహరించిన విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కన్నతల్లి మరణించి దిక్కులేని బాలికకు కన్న తండ్రి, అతని రెండో భార్య నకరం చూపించారు. ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. మానసిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారు. ఆమె ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యారు. తండ్రి పరారీలో ఉన్నాడు. సవతి తల్లి జైలుకు వెళ్లింది.

Family disfigured 19-year-old so that she couldn’t marry

ఆస్తి కోసమే వేధింపులు?

పినతల్లి చాముండేశ్వరి... ప్రత్యూషను ఆస్తికోసమే వేధించినట్లుగా తెలుస్తొంది. ఆమె ఆస్తి కాజేసేందుకు తల్లి ఆమె పైన ఆకృత్యాలకు దిగిందని సమాచారం. 2003లో రమేష్ మొదటి భార్య సరళా దేవి భర్తతో విడిపోయే సమయంలో పద్మారావు నగర్లో ఉన్న శ్రీరామ్ సీతమ్స్ అపార్టుమెంటులో ఉన్న ప్లాటును ప్రత్యూష పేరు మీద రాయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.

అనంతరం సరళా దేవి మృతి చెందారు. ఈ క్రమంలో ప్రత్యూషను బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్పించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరడంతో తండ్రి రమేష్ బండ్లగూడ ఆనంద నగర్‌లో తన ఇంటికి తీసుకు వచ్చాడు. పద్మారావు నగర్ ప్లాటు విలువ సుమారు రూ.కోటి ఉంటుంది.

ఆ ఆస్తి ప్రత్యూషకు దక్కుతుందన్న కారణంతో రమేష్ రెండో భార్య చాముండేశ్వరి యవతిని చిత్రహింసలకు గురి చేసేందని తెలుస్తోంది. పద్మారావు నగర్లో ఉన్నది డబుల్ బెడ్ రూం ప్లాటు. ఇదిలా ఉండగా, పరారీలో ఉన్న రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+