గణేషుడికి 5 తులాల బంగారం వేసి మర్చిపోయి నిమజ్జనం ..!
వినాయక చవితి వేడుకలు దేశమంతటా సందడిగా జరిగాయి. చాలామంది తమ ఇళ్లలో గణపయ్యను ప్రతిష్ఠించుకుని, అలంకారాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, నిమజ్జనం సమయంలో జరిగిన ఒక సంఘటన హైదరాబాద్‌లోని ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
5 తులాల బంగారు గొలుసు.. గణపయ్య మెడలో మరిచిపోయారు
హైదరాబాద్, వనస్థలిపురంలోని హస్తినాపురం హోమ్ ప్రసాద్ అపార్ట్‌మెంట్‌లో నివసించే గిరిజ అనే మహిళ తన ఇంట్లో గణపతిని ప్రతిష్టించి, ప్రత్యేకంగా అలంకరించింది. స్వామివారికి తన కుటుంబానికి చెందిన 5 తులాల బంగారు గొలుసును వేసి మూడు రోజుల పాటు పూజలు చేసింది. భక్తి పారవశ్యంలో ఉన్న ఆ కుటుంబం, నిమజ్జనం కోసం విగ్రహాన్ని తుర్కయాంజాల్ మాసబ్ చెరువుకు తీసుకెళ్లింది.

కంగారులో బంగారం గొలుసును తీయడం మర్చిపోయిన ఆ కుటుంబం, నిమజ్జనం పూర్తి చేశాక విషయం గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. గుండెలు ఆగినంత పనై, బోరున ఏడుస్తూ తుర్కయాంజాల్ మున్సిపాలిటీ సిబ్బందిని ఆశ్రయించారు.
గణపయ్య దయ.. బంగారు గొలుసు తిరిగి లభ్యం
ఆ కుటుంబం బాధను చూసిన మున్సిపాలిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. జేసీబీలతో ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో నిమజ్జనమైన వినాయక విగ్రహాలను పక్కకు జరిపి, గంటల తరబడి శ్రమించి చివరికి ఆ కుటుంబం విగ్రహాన్ని బయటకు తీశారు. ఆశ్చర్యకరంగా, విగ్రహం మెడలో ఉన్న బంగారం గొలుసు సురక్షితంగా ఉంది. సిబ్బంది దాన్ని ఆ కుటుంబానికి తిరిగి అప్పగించగా, ఆనందంతో వారికి కన్నీళ్లు ఆగలేదు.
పోయింది అనుకున్న బంగారం తిరిగి దొరకడంతో ఆ కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. "ఆ వినాయకుడే మళ్లీ మాకు దాన్ని ఇప్పించాడు. ఇది ఆయన లీల" అంటూ మున్సిపాలిటీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, నిమజ్జనం చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications