ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచ్ లు.. ఎలాగో తెలుసా..?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హవా కొనసాగుతోంది. ఇటీవల మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా 4,230 గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు 2,425 స్థానాల్లో విజయం సాధించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1,168 స్థానాల్లో గెలుపొందారు. ఇక బీజేపీ అభ్యర్థులు 189 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే స్వతంత్రులు 401 స్థానాల్లో గెలుపొందారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచ్ లు గా విజయం సాధించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందినవారు.. మూడు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ లుగా, వార్డు మెంబర్లుగా గెలుపొంది అందరినీ ఆశ్చర్య పరిచారు. ఒక సర్పంచ్ పదవికోసమే నానా తంటాలు పడుతున్న క్రమంలో ఒకే కుటుంబంలో ఏకంగా ఇంత మంది సర్పంచ్ లు అవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీళ్లంతా 1978 లో బోథ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అమర్ సింగ్ తిలావాత్ కుటుంబానికి చెందినవారు సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు కావడంతో రాజకీయ నేపథ్యం దృష్ట్యా విజయం సాధించినట్లు తెలుస్తోంది.

ఇంద్రవెల్లి మండలం ధనోరా(బీ) పంచాయతీకి చెందిన జమునా నాయక్ సర్పంచ్ గా గెలుపొందారు. ఆమె కుమార్తె అనురాధ 9వ వార్డులో విజయం సాధించారు. ఇక ఆమె భర్త హీరాలాల్ శంకర్ గూడ పంచాయతీ పరిధిలోని నాలుగో వార్డులో వార్డు మెంబర్ గా విజయం ఎన్నికయ్యారు. అలాగే శంకర్ గూడ పంచాయతీకి.. జమునా నాయక్ తోడికోడలు రోమా.. సర్పంచ్ గా విజయం సాధించడం విశేషం. అలాగే మండలంలోని ఎమానుకుంట పంచాయతీలో జమునా నాయక్ చిన్నమామ కుమారుడు జాదవ్ లఖన్ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అలాగే వీరి కుటుంబానికే చెందిన మరో నలుగురు వ్యక్తులు వార్డు మెంబర్లుగా విజయం సాధించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందినవారు ఇలా సర్పంచ్ లుగా, వార్డు మెంబర్లుగా విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications