వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు కేసీఆరే.. సిట్ విచారణపై డీకే అరుణ లాజికల్ ప్రశ్నలు!!

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార టిఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను విచారణ జరపడానికి ఏర్పాటు చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పై తమకు ఏమాత్రం నమ్మకం లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెల్లడించారు.

తమ డిమాండ్ లో తప్పేముంది? డీకే అరుణ ప్రశ్న

తమ డిమాండ్ లో తప్పేముంది? డీకే అరుణ ప్రశ్న

నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో విచారణ జరగకుండా అడ్డుకునేలా బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అబద్ధమని డీకే అరుణ పేర్కొన్నారు. ఫాంహౌస్ ఫైల్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రజలు నిజానిజాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారని పేర్కొన్న డీకే అరుణ ఆ కుట్రదారులు ఎవరో తెలియాలంటే హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. అలా కోరడంలో తప్పేముందో చెప్పాలని ప్రశ్నించారు.

 కేసీఆర్ ఆరోపణలకు భిన్నంగా ఆయన ఏర్పాటు చేసిన సిట్ పని చేస్తుందా?

కేసీఆర్ ఆరోపణలకు భిన్నంగా ఆయన ఏర్పాటు చేసిన సిట్ పని చేస్తుందా?

విచారణ అడ్డుకోవాలని తాము చూడటం లేదని పేర్కొన్న ఆమె టిఆర్ఎస్ పార్టీ విచారణను తప్పుదోవ పట్టించారని ప్రయత్నిస్తోంది కాబట్టే తాము అలా డిమాండ్ చేస్తున్నామని డీకే అరుణ స్పష్టం చేశారు. ఫామ్హౌస్ ఫైల్స్ కుట్రదారుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తన అనుమానం అని డీకే అరుణ ఆరోపించారు. ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే గత సంప్రదాయాలకు భిన్నంగా సీఎం కేసీఆర్ గంటల కొద్దీ మీడియా సమావేశం నిర్వహించి, ఏవేవో వీడియోలు చూపిస్తూ బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారని డి.కె.అరుణ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలకు భిన్నంగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో ఎలా పనిచేస్తుందని డీకే అరుణ ప్రశ్నించారు.

సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్

సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్

సీఎం కేసీఆర్ అభిప్రాయాలు రాష్ట్రస్థాయి సిట్ దర్యాప్తును ప్రభావితం చేస్తుందని డీకే అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు. కెసిఆర్ చేసిన ఆరోపణలకు భిన్నంగా, కెసిఆర్ ఏర్పాటు చేసిన సిట్ ఎలా పనిచేస్తుందో చెప్పాలని డి.కె.అరుణ ప్రశ్నించారు. అందుకే తాము నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరుకుంటున్నామని సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టు ఫుల్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశామని క్లారిటీ ఇచ్చారు. తమకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్న డీకే అరుణ న్యాయవ్యవస్థ పర్యవేక్షణలోనే సిట్ విచారణ జరపాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

కేసీఆర్ కు అభ్యంతరం దేనికి? ప్రశ్నించిన డీకే అరుణ

కేసీఆర్ కు అభ్యంతరం దేనికి? ప్రశ్నించిన డీకే అరుణ

సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ వ్యవహారంలో విచారణ చేయడానికి ఏర్పాటు చేసిన సిట్ పై ఏమాత్రం నమ్మకం లేదని డి.కె.అరుణ తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఆధారాలతో సహా దేశంలోని న్యాయమూర్తులందరికీ లేఖ రాశానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన డీకే అరుణ తాము కూడా న్యాయవ్యవస్థ పర్యవేక్షణలోనే విచారణ జరగాలని కోరితే అందులో అభ్యంతరం ఏమిటో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు.

నిజంగా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండి కెసిఆర్ వారికి లేఖ రాసిన మాట నిజమే అయితే, హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని తమ డిమాండ్ ను కూడా గౌరవించాలని డీకే అరుణ సీఎం కేసీఆర్ ను కోరారు.

English summary
DK Aruna raised a logical question about the SIT inquiry asking how can SIT do a proper investigation while KCR is the conspirator of the Farm House files.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X