వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ సర్కార్‌కు కొత్త సవాల్?: తెలంగాణపై రైతు నేతల నజర్: అయిదు రాష్ట్రాల్లో టూర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి కొత్త సవాల్ ఎదురు కాబోతోందా? రైతు ఆందోళన రూపంలో కేసీఆర్ సర్కార్‌కు సెగ తగులబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 95 రోజులుగా న్యూఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలను కొనసాగిస్తోన్న రైతుల సంఘాల నేతలు.. తమ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయబోతోన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు దాన్ని విస్తరింపజేయనున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతు, రైతుల సంఘాల అండను వారు కోరుకుంటోన్నారు.

ఆ తపన ఉన్నా శరీరం సహకరించలేదు: చిన్నప్పుడు చీరాలలో: ఆ యుద్ధ విద్యలకు ప్రోత్సాహం: పవన్ఆ తపన ఉన్నా శరీరం సహకరించలేదు: చిన్నప్పుడు చీరాలలో: ఆ యుద్ధ విద్యలకు ప్రోత్సాహం: పవన్

భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయిట్ వచ్చేనెల 1వ తేదీన తన పర్యటన ప్రారంభించనున్నారు. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ధర్మేంద్ర మలిక్, యుద్ధ్‌వీర్ సింగ్ వంటి నేతలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. తన పర్యటన సందర్భంగా టికాయిట్.. కిసాన్ మహా పంచాయత్‌ను నిర్వహిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో మార్చి 6వ తేదీన ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసినట్లు బీకేయూ మీడియా ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర మలిక్ తెలిపారు.

Farmer Leader To Tour 5 States including Telangana to Support For Farmers Protest

అలాగే రాజస్థాన్‌లో రెండు, మధ్యప్రదేశ్‌లో మూడు కిసాన్ మహా పంచాయత్‌లను నిర్వహిస్తామని అన్నారు. వచ్చేనెల 22వ తేదీన కర్ణాటకలో ఈ సభ ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెప్పారు. ఆయా రాష్ట్రాల రైతులు తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని తాము కోరుతామని అన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారాన్ని తాము కోరుతామని చెప్పారు. వారిని కలవడానికి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇదే పరంపరను కొనసాగిస్తామని, మిగిలిన రాష్ట్రాల్లో మహాసభలు ఉంటాయని అన్నారు. తమిళనాడు, కేరళల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించబోతోన్నందున అక్కడ పర్యటించట్లేదని ధర్మేంద్ర చెప్పారు.

English summary
Farmers' meetings will be held in Uttarakhand, Rajasthan, Madhya Pradesh, Karnataka and Telangana, while two meetings will also be held in Uttar Pradesh in March," BKU media in-charge Dharmendra Malik said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X