
ముదురుతున్న పసుపు బోర్డ్ వ్యవహారం.!తిగబడుతున్న జనం.!ఎంపీ అరవింద్ కు తప్పని తిప్పలు.!
నిజామాబాద్/హైదరాబాద్: నిజామాబాద్ బీజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు పసుపు బోర్డ్ ఏర్పాటు సమస్య తీవ్రంగా పరణమించినట్టు తెలుస్తోంది. పసుపు బోర్డ్ అంశంలో ప్రజలు నిలదీసే పరిస్థితులు నెకొన్నాయి. అధికారిక కార్యక్రమాల కోసం ఎంపీ హోదాలో ఎక్కడికి వెళ్లినా అక్కడ ప్రజలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామ పర్యటనకి వెళ్తున్న బీజేపి ఎంపీ అరవింద్ ని అడ్డుకోవడానికి వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద బాల్కొండ నియోజకవర్గ రైతులు నిరసన చేపట్టారు.

ఎంపి అరవింద్ కు రైతుల నిరసన సెగలు..
పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని, పసుపుకు, ఎర్రజొన్నలకు మద్దతు ధర తీసుకువస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చిన హామీని నెరవేర్చాలని, అరవింద్ గో బ్యాక్ అంటూ నిరసన తెలియజేసిన రైతాంగం, అరవింద్ ను కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో కార్యక్రమంలో పాల్గొనకుండా ఎంపీ అరవింద్ వెనుదిరిగారు. ఆ సంఘటన మరువక ముందే ఆర్మూరు మండలంలో మరో సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.

అరవింద్ ఇంటి ముందు నిరసన..
ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఎంపీ అర్వింద్ నివాసం ముందు పసుపు కుప్పలు వేసి రైతుల నిరసన తెలిపారు. వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని మండల ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు. దీంతో ఎంపీ ధర్మపురి అరవింద్ పై పసుపు రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పసుపు రైతులను మోసం చేసారంటూ అరవింద్ ఇంటి ముందు పసుపు పంట పోసి నిరసన తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ పసుపు రైతులకు చేసిన ద్రోహాన్ని ఆర్టీఐ సమాచారంతో బట్టబయలు చేశారు.

అరవింద్ నిజామాబాద్ ప్రజలకు ఏంచేసారు..
దీంతో అరవింద్ ఓట్ల కోసం తమ మనోభావాలతో ఆడుకున్నాడని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ నిజామాబాద్ లో ఎక్కడ పర్యటించినా అడ్డుకుని తీరుతామని పసుపు రైతులు స్పష్టం చేశారు. దీంతో ఎంపీ అరవింద్ కు పసుపు బోర్డుకు సంబందించిన సమస్య తీవ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. పసుపు బోర్డు అంశంలో స్దానికులను అరవింద్ ఎలా ఒప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డ్ సాధించుకొస్తానని ధర్మపురి అరవింద్ జిల్లా రైతాంగానికి బాండ్ పేపర్ రాసిచ్చిన అంశం తెలిసిందే.

అంతా ఆవిడే చేసింది..
ఇప్పుడు అదే బాండ్ పేపర్ అరవింద్ బ్యాండ్ బజాయిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొన్న నిజామాబాద్ లో పర్యటించినప్పటినుండి అక్కడ పరిస్థితులు పూర్తగా మారిపోయినట్టు తెలుస్తోంది. ఎంపీ అరవింద్ ఏ వాగ్దానం చేసి ఎంపి అయ్యరో, ఎంపీ ఐన రెండున్నరేళ్తుగా ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో ఆదారాలతో సహా చూపించారు. దీంతో ప్రజలు ఎంపీ అరవింద్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నట్టు తెలుస్తోంది.