• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల మరణమృదంగం.!కేసీఆర్ కు కనిపించవా.?చావు కేకలు వినిపించవా.?నిలదీసిన షర్మిళ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. పంజాబ్ రైతుల చావులు మాత్రమే దొర చంద్రశేఖర్ రావు కి కనబడతాయా.?తెలంగాణ రైతుల చావులు దొర కంటికి కనిపించవా.?చావు కేకలు వినిపించవా అని నిలదీసారు షర్మిళ. పది రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి రైతులు అల్లాడుతున్నారని, ధాన్యాన్ని కొంటారో కొనరో తెలియక కుప్పల వద్దే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు. ఆరుగాలం పండించిన పంట వర్షానికి నీటి పాలవ్వకముందే కొనాలన్నా సోయి కూడా లేదని ముఖ్యమంత్రిపై షర్మిళ ధ్వజమెత్తారు.

 రైతు రాములు మరణం సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే.. తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిళ

రైతు రాములు మరణం సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే.. తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిళ


సీఎం చంద్రశేఖర్ రావు నిర్లక్ష్యానికి రైతులకు ఇప్పుడు ఖరీఫ్ భయం పట్టుకుందని, వానాకాలం పంటలు వేసుకోవడానికి పొలాల బాట పట్టాల్సి ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు షర్మిళ. ప్రభుత్వం వడ్లు కొనక కల్లాల్లోనే రైతును పడి గాపులు కాయిస్తున్నారన్నారు. సీఎం రైతుల పంటలు కొనకుండా, పాడె ఎక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆఖరి గింజ వరకూ కొంటానని రైతుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకెంతమంది రైతులు చనిపోతే ధాన్యం కొంటారు దొరా?అని సీఎం చంద్రశేఖర్ రావును సూటిగా ప్రశ్నించారు షర్మిళ.

 రాములు కుటుంభానికి షర్మిళ సంఘీభావం.. నష్టపరిహారం ఇవ్వాలన్న షర్మిళ

రాములు కుటుంభానికి షర్మిళ సంఘీభావం.. నష్టపరిహారం ఇవ్వాలన్న షర్మిళ


ఇతిలా ఉండగా ఈ నెల 28 నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సత్తుపల్లి నుంచే మళ్ళీ యాత్ర మొదలవుతుందని, పాదయాత్రతో అడుగడుగునా ప్రజా సమస్యలు వైఎస్ షర్మిళ తెలుసుకుంటున్నారని పార్టీ ముఖ్యనేతలు చెప్పుకొస్తున్నారు. పాదయాత్రతో పార్టీకి ఆదరణ పెరుగుతోందని, వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ రావలని ప్రజలు కోరుకుంటున్నారుని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ షర్మిళపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు పార్టీ నేతలు.

 ఈ నెల 28 నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. షర్మిళకు ప్రజాధరణ పెరుగుతుందన్న నేతలు

ఈ నెల 28 నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. షర్మిళకు ప్రజాధరణ పెరుగుతుందన్న నేతలు


వైఎస్సార్ కుటుంభం అంటే ప్రజలకు ఒక నమ్మకమని, వైఎస్సార్ ది త్యాగాల కుటుంబమని, బోగాలా కుటుంభం చంద్రశేఖర్ రావుదని, వీసా తీసుకొని రావాలా అని చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారని మరొక్కసారి నేతలు గుర్తు చేసారు. చంద్రవేఖర్ రావు కుటుంభం నుంచి వీసా తీసుకొని రావాలా అని వైఎస్సార్ అన్నారని, చంద్రశేఖర్ రావులా పూటకో మాట వైఎస్సార్ మాట్లాడలేదన్నారు కీలక నేతలు. కరీంనగర్ లో ఒక మాట, పంటితో ముళ్ళు తీస్తా అని మరో మాట, ఇలాంటి మాటలు ఏనాడూ వైఎస్సార్ చెప్పలేదన్నారు నేతలు.

 రేవంత్ కుల రాజకీయం.. వర్కౌట్ కాదంటున్న షర్మిళ పార్టీ నేతలు

రేవంత్ కుల రాజకీయం.. వర్కౌట్ కాదంటున్న షర్మిళ పార్టీ నేతలు


నిరంజన్ రెడ్డి పంచె కట్టినంత మాత్రాన రైతు అయిపోలేదని, మీ లెక్క రాత్రికి రాత్రి వైఎస్సార్ కుటుంబానికి పదవులు రాలేదన్నారు నాయకులు. రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజలకు మేలు చేసే వాళ్ళే ఆదరణ పొందుతారని, ఫలనా కులం వాళ్ళు మాత్రమే రాజకీయం చేయాలని ఎక్కడా లేదన్నారు వైసిపీ నేతలు. రేవంత్ రెడ్డి నామిని పిసిసి అద్య క్షుడని, కొంత మంది నామిని కోసం రేవంత్ రెడ్డి నియామకం జరిగిందని, నామిని గా ప్రపోజ్ చేసిన వాళ్ళ కులం కాకుండా వేరే కులం మన్ననల కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని వైయస్సార్ టీపి నేతలు ఎద్దేవా చేసారు.

English summary
YSSR Telangana party president YS Sharmila has once again expressed anger over Telangana CM Chandrasekhar Rao. Can only Chandrasekhar Rao see the deaths of Punjab farmers? Can the deaths of Telangana farmers be seen by the aristocracy? Can the cries of death be heard? Sharmila asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X