తెలంగాణలో రైతుల మరణమృదంగం.!మృత్యుక్రీడలను మోదీ,కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నారన్న జగ్గారెడ్డి.!

హైదరాబాద్ : తెలంగాణ వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నాం కానీ పరిస్ధితులు మరింత దిగజారిపోతాయని అనుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేకున్నా తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని జగ్గారెడ్డి స్పష్టం చేసారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి
ఏడున్నరేళ్లు గడిచినా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని జగ్గారెడ్డి విచారం వ్యక్తం చేసారు.

సమస్య సృష్టించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే.. పరిష్కరిస్తున్నట్టు మోదీ, కేసీఆర్ నటిస్తున్నారన్న జగ్గారెడ్డి

సమస్య సృష్టించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే.. పరిష్కరిస్తున్నట్టు మోదీ, కేసీఆర్ నటిస్తున్నారన్న జగ్గారెడ్డి

స్వీయ పాలనలో రైతులు రోడ్లపై కటిక నేల మీద పడుకుంటున్నారని, సీఎం చంద్రశేఖర్ రావు మాత్రం ఇంద్రభవనం లాంటి ప్రగతి భవన్ లో పడుకుంటున్నాడని ఎద్దేవా చేసారు. రైతులు ఎండలో ఎండుతుంటే, సీఎం చంద్రశేఖర్ రావు ఏసీ గదుల్లో విలాసవంతంగా గడుపుతున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి. ఆహార భద్రత కల్పించాలని ఆనాటి ప్రధాని దివంగత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎఫ్సీఐ ని రూపొందించారని, దీని ద్వారా ధాన్యం కొనుగోలు జరపాలనే వినూత్న పాలసీని తీసుకొచ్చారని జగ్గారెడ్డి గుర్తు చేసారు. అప్పటి నుండి యూపీయే అధికారంలో ఉన్నప్పటి వరకు ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్య తలెత్తలేదని జగ్గారెడ్డి తెలిపారు.

రైతులు రోడ్లపై పడుకుంటే..కేసీఆర్ విలాసవంతమైన భవన్ లో ఉంటున్నారన్న జగ్గారెడ్డి

రైతులు రోడ్లపై పడుకుంటే..కేసీఆర్ విలాసవంతమైన భవన్ లో ఉంటున్నారన్న జగ్గారెడ్డి

ధాన్యం క్రయ విక్రయాల అంశం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నేతలు సృష్టించిన సమస్య అని స్పష్టం చేసారు. రైతుల జీవితాలు రోడ్ల పాలు కావడానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రధాన కారణమని విరుచుకు పడ్డారు జగ్గారెడ్డి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి గులాబీ నాయకులు ఓటేశారని, బీజేపీ చెప్పింది తూచా తప్పకుండా పాటించిందని గులాబీ పార్టీ పై మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రైతులు దిక్కుతోచని స్థితిలో రోడ్ల మీద పడిగాపులు కాస్తంటే, ప్రధాని మోదీని ఒప్పించి ధాన్యం కొనేలా ఎందుకు చొరవ చూపించలేకపోతున్నారని జగ్గారెడ్డి సీఎం చంద్రశేఖర్ రావును సూటిగా ప్రశ్నించారు. బీజేపీతో విందులు చేసుకుంటారు, పథకాలకు మద్దత్తు ప్రకటిస్తారు, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు కానీ ధాన్యం మాత్రం కొనుగోలు చేసేలా ఒప్పించలేక పోతున్నారా అని జగ్గారెడ్డి గులాబీ బాస్ ను నిలదీసారు.

కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటం ఓ పెద్ద డ్రామా.. ఒప్పందంలో భాగంగా నిరసనలన్న జగ్గారెడ్డి

కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటం ఓ పెద్ద డ్రామా.. ఒప్పందంలో భాగంగా నిరసనలన్న జగ్గారెడ్డి

రాజకీయ లబ్ధి కోసం కుస్తీ పడుతున్నారని, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూర్చొని సమస్యను పరిష్కారించాల్సింది పోయి, తెలంగాణలో యుద్ద వాతావరణం సృష్టిస్తూ రాష్ట్ర రైతాంగాన్ని దిక్కులేని వాళ్లరు చేస్తారా అని నిలదీసారు జగ్గారెడ్డి. బీజేపీ గులాబీ పార్టీ మీద, గులాబీ పార్టీ బీజేపి మీద యుద్ధం చేపసుకుంటున్నాయని, ఇది చాలా విచిత్రంగా పరిణమించిందని అయోమయాన్ని వ్యక్తం చేసారు జగ్గారెడ్డి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీ టీఆర్ఎస్ పార్టీలే సమస్యను సృష్టించి, సమస్య పరిష్కారానికి పోరాడుతున్నట్టు నటిస్తున్నాయని జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసారు.

కేసీఆర్ ను అడ్డం పెట్టుకని మోదీ డ్రామాలు.. కలిసే కుట్రలు పన్నుతున్నారన్న జగ్గారెడ్డి.

కేసీఆర్ ను అడ్డం పెట్టుకని మోదీ డ్రామాలు.. కలిసే కుట్రలు పన్నుతున్నారన్న జగ్గారెడ్డి.

కేంద్ర బీజేపి ప్రభుత్వం, రాష్ట్ర గులాబీ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాగుకుంటున్నాయని, డబుల్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే
తెలంగాణ మంత్రులు కొత్త డ్రామా ఆడుతున్నరని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు కాబట్టి, టీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయ కుట్రలకు శ్రీకారం చుట్టాయని ధ్వజమెత్తారు. ప్రదాని మోదీ సీఎం చంద్రశేఖర్ రావును అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని, వరి ధాన్యం కొనుగోలు వెనక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల రాజకీయ కుట్ర ఉందని, తెలంగాణ రైతుల జీవితాలతో మోదీ, కేసీఆర్ రాజకీయ కుట్ర చేస్తున్నారని స్పష్టం చేసారు జగ్గారెడ్డి. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలన్న టీఆర్ఎస్, నిర్ణయాలన్ని ఎండగడతామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+