తెలంగాణాలో రైతుల కల్లాల పంచాయితీ: నేడు మహాధర్నాలు; బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ: తప్పెవరిది?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన రైతుల కల్లాల పంచాయతీ ఏమిటి? అసలు కేంద్రం ఆ నిధులను తిరిగి ఇవ్వమని ఎందుకు కోరింది? కల్లాలను నిర్మించిన డబ్బులను తిరిగి ఇవ్వడానికి ససేమిరా అంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన బాట పట్టి ఏం చేయబోతోంది? వంటి అనేక అంశాలపై ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తెలంగాణాలో రైతు కల్లాల పంచాయితీ .. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

తెలంగాణాలో రైతు కల్లాల పంచాయితీ .. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బి ఆర్ ఎస్ వర్సెస్ బిజెపి రగడ కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం నిర్మించిన కల్లాలకు సంబంధించి ఖర్చు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి హామీ నిధులతో తెలంగాణ రైతుల కోసం కల్లాలు నిర్మించుకుంటే మోడీ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని మంత్రి కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో అన్ని జిల్లా కేంద్రాల్లో రైతుల మహాధర్నాలో చేపట్టి కేంద్రంపై యుద్ధం ప్రకటించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.

అసలు కల్లాల పంచాయితీ ఇదే

అసలు కల్లాల పంచాయితీ ఇదే

అయితే అసలు ఈ కల్లాల పంచాయతీ ఏమిటి అంటే.. తెలంగాణ ప్రభుత్వం రైతుల వ్యవసాయ సమస్యలు పరిష్కరించడం కోసం కల్లాల నిర్మాణం చేపట్టింది. ఉపాధి హామీ నిధులతో తెలంగాణ ప్రభుత్వం రైతుల పొలాల్లో కల్లాలను నిర్మిస్తుంది. మొత్తం 750 కోట్ల నిధులతో 79 వేల వ్యవసాయ కల్లాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందులో ఉపాధి హామీ నుండి నిధులను మళ్లించినట్లు పేర్కొని 151 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలని కేంద్ర రాష్ట్రానికి నోటీసు ఇచ్చిందని తెలుస్తుంది. అయితే రైతుల కోసం కల్లాలను నిర్మించటం తప్పు కాదు కానీ, ఉపాధిహామీ నిబంధనల ప్రకారం, ఉపాధి హామీ నిధులను వాటికి కేటాయించడం కేంద్ర ప్రభుత్వ లెక్కప్రకారం తప్పు. ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందని, వాటిని వెంటనే వెనక్కి ఇవ్వాలని కేంద్రం పేర్కొంది.

 బీఆర్ఎస్ ఆందోళనలు.. మంత్రి కేటీఆర్ వాదన ఇలా

బీఆర్ఎస్ ఆందోళనలు.. మంత్రి కేటీఆర్ వాదన ఇలా

అయితే ఉపాధి హామీ నిధులను రైతుల కోసం వినియోగిస్తే తప్పేమిటని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ రైతు సంక్షేమం కోసం తాము చేసింది మంచేనని తేల్చి చెబుతోంది. రైతులకు ఉపయోగపడే సిమెంటు కల్లాల నిర్మాణం పై కావాలని కేంద్రం రాద్ధాంతం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పటి నుంచో ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధంగా మార్చాలని కోరుతున్నామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయకుండా ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం షరతులు పెడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

తప్పు ఎవరిది? కేంద్రం వర్సెస్ తెలంగాణా ప్రభుత్వం

తప్పు ఎవరిది? కేంద్రం వర్సెస్ తెలంగాణా ప్రభుత్వం

రైతుల కోసం ప్రభుత్వం కల్లాలు నిర్మించాలని అనుకోవడం నేరమా అంటూ పేర్కొన్న మంత్రి కేటీఆర్ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని, రైతుల కల్లాల కోసం కేటాయించిన నిధులను కూడా కేంద్రం తిరిగి ఇవ్వమంటున్నది అంటూ కేంద్రంలో అధికారంలో ఉంది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ పార్టీ ఆందోళనలతో కేంద్రంపై యుద్ధం ప్రకటించడానికి ఇదే కారణం అని తెలుస్తుంది. అయితే ఇందులో ఉపాధిహామీ నిధులను రైతు కల్లాలను నిర్మించడానికి దుర్వినియోగం చేశారని ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన బిజెపిది తప్పా ? లేక ఉపాధి హామీ నిధులను వినియోగించకూడదు అని తెలిసి కూడా రైతుల కల్లాల కోసం వినియోగించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్పా ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+