వీడు తండ్రేనా: తనకు పుట్టలేదని కూతురిపై అఘాయిత్యం, హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఓ వ్యక్తి తప్పతాగి తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతూ చివరకు ఆమెను హత్య చేశాడు. తండ్రి చేష్టలకు భయపడి పారిపోతున్న కూతురిని అతను శనివారం రాత్రి హత్య చేశాడు. హైదరాబాదులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన పత్తివాడ సురేష్ (28), జ్యోతి మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి కీర్తీ అనే కూతురు ఉంది.

Father rapes and kills daughter in Hyderabad

అనుమానం పెంచుకున్న అతను భార్యను తరుచుగా వేధిస్తూ వచ్చాడు. కూతురు కీర్తి తనకు పుట్టలేదని అంటూ అతను ఆమెను కొట్టేవాడు. అతని వేధింపులు భరించలేక జ్యోతి కొన్నాళ్ల క్రితం కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే నెల రోజుల క్రితం సురేష్ అక్కడికి వెళ్లి తాగుడు మానేస్తానని, భార్యాబిడ్డలను బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుని వారిని హైదరాబాద్ తెచ్చాడు.

హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌లో ఉంటున్న వారు కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్‌కు మకాం మార్చారు. ఓ ప్లాట్‌లో అతను వాచ్‌మన్‌గా కుదిరాడు. తాగుడుకు బానిసైన సురేష్ ఎప్పటి లాగే వ్యవహరిస్తూ వచ్చాడు. పైగా చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి తప్పతాగి వచ్ిచ అతను మరోసారి భార్యతో గొడవ పడ్డాడు.

ఆ గొడవతో ఏడుపు లంకించుకున్న కూతురిని సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దాంతో చిన్నారి పారిపోవడానికి ప్రయత్నించింది. అతను వదలకుండా ఆమెను పట్టుకుని బలంగా గొడకేసి కొట్టాడు. పళ్లతో పాశవికంగా కొరికాడు. దాంతో చిన్నారి మరణించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man Suresh sexually assaulted her daughter and killed her in Hyderabad.
Please Wait while comments are loading...