వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ నగరానికి ఫివర్.!ఉత్సాహంగా ఊళ్లకు వెళ్లి జ్వరంతో నీరసంగా తిరిగొచ్చిన జనం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హైదరాబాద్ నగర పరిస్థితులు మళ్లీ ఆరు రోగాలు మూడు ఆసుపత్రుల మాదిరిగా తయారయ్యింది. ఒమిక్రాన్ విజృంభిస్తోన్న కారణంగా జాగ్రత్తలు తీసుకుంటున్న క్రమంలో నగర ప్రజలను జ్వరం పట్టి పీడిస్తోంది. వాక్సినేషన్ రెండు డోసులు వేసుకున్నప్పటికీ కూడా ఒళ్లు నొప్పులు, జలుబు, జ్వరంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. అంతే కాకుండా సంక్రాంతి సెలవులకు ఉత్సాహంగా ఊళ్లకు వెళ్లిన వాళ్లు మాయదారి జర్వంతో నిరుత్సాహంగా హైదరాబాద్ నగరానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

 నగరారికి జ్వరం.. ప్రతి పది మందిలో ఇద్దరికి ఫివర్

నగరారికి జ్వరం.. ప్రతి పది మందిలో ఇద్దరికి ఫివర్

హైదరాబాద్ నగరం మరొక్క సారి మూలుగుతోంది. ఒళ్లు నొప్పులు, జలుబు, జ్వరంతో ఇబ్బంది పడుతోంది. దేశంతో పాటు రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ విజృంభనకు సంబందించి ఆక్షలు అమలవుతున్న వేళ జ్వరం, జలుబుతో నగర వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు తరలి వెళ్లిన జనాలు స్వరంతో తిరిగొచ్చి వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నట్టు తెలుస్తోంది. ఐతే కరోనా వైరస్ లక్షణాలు లేవని, సాధారణ సీజనల్ వారీగా వచ్చే జ్వరాలే చాలా మందికి వస్తున్నాయని డాక్టర్లు నిర్దారిస్తున్నారు.

 కొంప ముంచిన చల్లటి వాతావరణం.. జలుబుతోనే అన్ని అనర్దాలు

కొంప ముంచిన చల్లటి వాతావరణం.. జలుబుతోనే అన్ని అనర్దాలు

కరోనావైరస్ ను నియంత్రించేందుకు రెండు డోసులు వ్యాక్సీన్ వేయించుకున్న వారికి అంత తేలికగా జ్వరం రాదనుకున్నారు సాధారణ ప్రజలు.కానీ రెండు డోసుల వ్యాక్సీన్ వేయించుకున్నప్పటికీ జ్వరం వస్తుండడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కరోనా బారిన పడ్డామా అనే సందేహంతో దిగులుపడుతున్నట్టు తెలుస్తోంది. సాదారణ ఒళ్లు నొప్పులు. జ్వరం అని వైద్యులు తేల్చి చెప్పడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. నగరం జ్వరం బారిన పడడానికి ప్రధాన కారణం అదే అంటున్నారు వైద్యులు.

 గ్రామీణ వాతావరణంలో పంజావిసిరిన చలి.. సంక్రాంతి సెలవులకు వెళ్లినవారందరికి జ్వరం..

గ్రామీణ వాతావరణంలో పంజావిసిరిన చలి.. సంక్రాంతి సెలవులకు వెళ్లినవారందరికి జ్వరం..

హైదరాబాద్ నగరం నుండి దాదాపు 50లక్షల మంది జనాలు సంక్రాంతి పండుగకోసం ఊళ్లకు వెళ్లి వచ్చారు. వెళ్లేప్పుడు ఎంత ఉత్సాహంగా వెళ్లారో వచ్చేప్పుడు మాత్రం అంతే నీరసంగా నగరానికి చేరుకున్నారు. ఊళ్లల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జలుబుతో చాలా మంది ఇబ్బందులు పడ్డట్టు సమాచారం. జలుబు బారిన పడ్డతర్వాత తలనొప్పి జ్వరం రావడంతో జనాలు ఆందోళనకు గురయ్యారు. ఊళ్లలో ఉండే కన్నా నగరంలో మెరుగైన వైద్యం తీసుకోవచ్చని చాలా మంది జ్వరంతోనే నగరానికి చేరుకున్నారు.

 ప్రమాదం కాదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

ప్రమాదం కాదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో వందమందిలో సగటున 20మందికి జ్వరం ఉన్నట్టు, వీరందరూ ఇంటిపట్టునే ఉండి వైద్యుల సలహా మేరకు చికిత్సపొందుతున్నట్టు తెలుస్తోంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి కరోనా సోకదని, సాధారణ జ్వరం మాత్రమే వస్తుందని, ఐనప్పటికి తగు జాగ్రత్తులు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కరోనా బాదితుల కన్నా జ్వరం బాదితులు నగరంలో గణనీయంగా పెరిగిపోయారని, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని, మందులు వాడితే సరిపోతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. చలి తీవ్రంగా ఉందని, దీని ప్రభావం తగ్గితే ఎలాంటి సమస్యలు ఉండవని వైద్యులు నిర్దారిస్తున్నారు.

English summary
The city people are suffering from fever in order to take precautions as Omicron is booming. Despite taking two doses of vaccination, city dwellers are reported to be suffering from aches, colds and fevers. Apart from that, it seems that those who went to Villages for the Sankranthi holidays have arrived in Hyderabad disappointed with Fever.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X