నగరంలో మొదలైన ఫివర్ సర్వే.!స్వయంగా పాల్గొన్న మేయర్.!
హైదరాబాద్ : ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అంతకన్నా వేగంగా తెలంగాణ ప్రభుత్వ యత్రాంగం పనిచేస్తోంది. నగరంలో ఎవరికి జ్వరం సోకింది, ఎవనికి లోకలేదు అనే అంశాన్ని తెలుసుకునేందుకు మేయర్ విజయలక్ష్మి రంగప్రవేశం చేసారు. బంజారాహిల్స్ ఎన్బీటి నగర్ లో ఫీవర్ సర్వేను మేయర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచనలతో శుక్రవారం నుండి ఫీవర్ సర్వే ప్రారబించడం జరిగిందని మేయర్ విజయ లక్ష్మి స్పష్టం చేసారు. గతంలో రెండు సార్లు నిర్వహించిన అనుభవంతో ఈ సారి కూడా వైద్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నట్టు తెలిపారు.

జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్ లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మేయర్. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ లకు ప్రైవేట్ హాస్పిటల్ ల్యాబ్ లలో 500 రూపాయలు మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని గుర్తు చేసారు. కావున ఎవరైనా ఎక్కువగా కలెక్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ హెచ్చరించారు. 60 ఏళ్ల పై పడిన వారందరూ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని, అలాగే వ్యాక్సినేషన్ రెండవ డోస్ తీసుకోని వారందరూ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు మేయర్. రెండవ డోసు తీసుకున్న 9 నెలల తరువాత బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని, నగర ప్రజలు మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని మేయర్ సూచించారు.