తెలంగాణ ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగు కొత్త కాలేజీలు, కొత్త కోర్సులు రావడంతో షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.

ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ 2023 వెబ్ ఆప్షన్ల గడువు ఆగస్టు 22వరకు పొడిగించారు. నాలుగు కొత్త కాలేజీలు అందుబాటులోకి రావడంతో.. ఇవాళ ప్రారంభమైన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేశారు. మహబూబాబాద్, పాలేరులో జేఎన్టీయూ కాలేజీలతో పాటు.. కొమ్మూరి ప్రతాప్
రెడ్డి, టీకేఆర్ పాలిటెక్నిక్‌లు ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి.

 Few changes in Telangana Engineering Special Batch Counselling 2023

కొన్ని కాలేజీల్లో అదనపు సీట్లు, కోర్సులకు కూడా అనుమతి లభించింది. శుక్రవారం ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఆగస్టు 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి.. ఈనెల 26న ప్రత్యేక విడత సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 27 నుంచి 29 వరకు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఆగస్టు 26న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు.

కాగా, తెలంగాణ ఇంజినీరింగ్‌ తుది విడత సీట్లు కేటాయింపును పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటాలో 70,627 సీట్లను భర్తీ చేసినట్లు వెల్లడించింది. ఈ సీట్లను భర్తీ చేయగా ఇంకా కన్వీనర్‌ కోటాలో 13,139 సీట్లు మిగిలిపోయినట్లు ఉన్నతవిద్యామండలి పేర్కొంది. మిగిలి పోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 17న ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మొదట తెలిపినా.. ఇప్పుడు ఆగస్టు 26కు తేదీని మార్చారు.

ఇప్పటికే జరిగిన తెలంగాణ ఇంజినీరింగ్‌ రెండో విడతలో కన్వీనర్‌ కోటా సీట్లను కేటాయించారు. ఈ కోటాలో 7,417 మందికి సీట్లు దక్కాయి. మరో 25,148 మంది కాలేజీ లేదా కోర్సులు మార్చుకున్నారు. ఈ విడతలో కన్వీనర్‌ కోటాలో 12,013 సీట్లు మిగిలాయి. ఈ కన్వీనర్‌ కోటాలో మొత్తం 82,702 సీట్లు అందుబాటులో ఉండగా.. రెండో విడత కౌన్సెలింగ్‌తో కలిపి 70,689 సీట్లు భర్తీ అయ్యాయి.

ఆగస్టు 2న వీరు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. కొన్ని బ్రాంచ్‌లలో సీట్లు పూర్తిగా నిండలేదు. మొదటి విడతలో 70,665 ఇంజినీరింగ్​ సీట్లను భర్తీ చేశారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 22న సెల్ఫ్​ రిపోర్టింగ్​ చేశారు. దీంతో 85.48 శాతం సీట్లు భర్తీ అయినట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. మొదటి విడతలో మూడు యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కళాశాలల్లో సీట్లన్నీ నిండిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+