ఫ్రీ ఇంటర్నెట్, ధరణి స్థానంలో భూమాత పోర్టల్: కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరిన్ని కీలక హామీలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. ప్రజలపై హామీ వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మరికొన్ని హామీలను ఆ జాబితాలో చేర్చింది. ఏకకాలంలో రూ. 2 లక్షల పంట రుణమాఫీ, రూ. 3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణాలు, వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఈ క్రమంలో పలు కీలక హామీలను కలుపుకుని మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది.

మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ అన్ని వర్గాలను, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మత పెద్దలు, అనేక సామాజిక వర్గాలకు చెందిన నాయకులను, ఉద్యోగులు, నిరుద్యోగులను సంప్రదించి మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, శుక్రవారం మధ్యాహ్నం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని పేర్కొన్నాయి.

few more assurances listed in the Telangana congress manifesto

తాజాగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన హామీలు:

మెగా డీఎస్సీ ప్రకటించి.. ఆరు నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల, పారదర్శకంగా నియామక ప్రక్రియ
విద్యార్థులందరికీ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం
బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయింపు
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ. 10వేల వేతనం
మూతబడిన దాదాపు 6వేల పాఠశాలలను పున:ప్రారంభిస్తాం
కొత్తగా నాలుగు ట్రిపుల్ ఐటీల ఏర్పాటు
ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకాలి సర్జరీ వర్తింపు
ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి మెరుగైన వైద్యం అందిస్తాం

ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ప్రవేశపెడతాం
భూహక్కుల సమస్యల పరిష్కారానికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు
పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తాం
సర్పంచ్‌ల ఖాతాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులు జమ
గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు రూ. 1500 గౌరవ వేతనం
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ డీఏలు చెల్లిస్తాం
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తాం
కొత్త పీఆఆర్సీ ఏర్పాటు చేసి.. ఆరు నెలల్లో అమలు చేస్తాం
గ్రామపంచాయతీలకు చెరువుల నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలు.. ఇందుకోసం తగినన్ని నిధులు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+