జువైనల్ హోం నుండి 15 మంది జంప్, ముగ్గురి పట్టివేత
హైదరాబాద్: హైద్రాబాద్ సైదాబాద్‌లోని జువైనల్ హోం నుండి సుమారు 15 మంది బాలురు తప్పించుకొన్నారు. తప్పించుకొన్న బాలల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు జువైనల్ హోం నుండి తప్పించుకొన్న బాలల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే జువైనల్ హోం నుండి తప్పించుకొన్న వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన 12 మందిని కూడ త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

జువైనల్ హోం నుండి రెండు గ్రూపులుగా విడిపోయిన బాలురు పారిపోయారు. కిటికీ ఇనుప చువ్వలను ఆక్సాబ్లేడ్, కట్టర్ సహయంతో కోసి గోడ దూకి తప్పించుకొన్నారు. ఈ విషయమై జువైనల్ హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు.
జువైనల్ హోం నుండి 15 మంది బాలురు తప్పించుకొన్న ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జువైనల్ హోం నుండి తప్పించుకొన్న బాలలపై రాచకొండ, సైబరాబాద్, హైద్రాబాద్ కమిషనరేట్లలో పలు కేసులున్నాయి.
జువైనల్ హోం నుండి ఇటీవలనే తప్పించుకొన్న ఐదుగురు బాలలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తాజా ఘటనతో మరోసారి పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. మరోవైపు జువైనల్ హోం నుండి 15 మంది బాలలు తప్పించుకొన్న ఘటనపై ఇద్దరిపై జైళ్ళ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకొంది.












Click it and Unblock the Notifications