అఖిల్ ఎఫెక్ట్: క్రిమినల్ కేసులో హీరో నితిన్, సోదరి నిఖితా రెడ్డిలకు ఊరట
హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో నటుడు నితిన్, ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం ఊరట లభించింది. నితిన్, ఆయన సోదరి నిఖితా రెడ్డిలపై మల్కాజిగిరి కోర్టులో ఉన్న క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
కేసును కొట్టివేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. అఖిల్ సినిమాకు సంబంధించిన హక్కులు ఇస్తామంటూ రూ.50 లక్షలు తీసుకుని, ఆ తర్వాత ఇవ్వకుండా మోసం చేశారని సికింద్రాబాద్‌కు చెందిన జి సత్యనారాయణ మల్కాజిగిరి కోర్టులో ఫిర్యాదు చేశారు.

నితిన్, నిఖితా రెడ్డిలు నిందితులుగా
ఇందులో నితిన్‌తో పాటు ఆయన సోదరి నిఖితా రెడ్డి, తండ్రి సుధాకర్ రెడ్డిలను, శ్రేష్ఠ్ మూవీస్‌ను నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన ఇరవయ్యవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

కేసు కొట్టివేయాలని వేర్వేరుగా
అయితే, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ నితిన్, నిఖితా రెడ్డి తదితరులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారం చెక్కులకు సంబంధించిన సివిల్ వివాదమని, క్రిమినల్ కేసు పెట్టడం సరికాదన్నారు.

నితిన్, నిఖితా రెడ్డిలు భాగస్వాములంటూ తప్పుగా
అంతేకాకుండా, శ్రేష్ట మూవీస్ సంస్థలో నితిన్, నిఖితా రెడ్డిలు భాగస్వాములంటూ తప్పుగా పేర్కొని ఫిర్యాదు చేశారని, అందులో వారు భాగస్వాములు కాదని న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ వాదనను హైకోర్టు ఆమోదించి కేసును కొట్టివేసింది.

2017లో ఈ కేసు నమోదు
సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురికి చెందిన సత్యనారాయణ 2017 సెప్టెంబర్ నెలలో ఈ కేసు వేశారు. శ్రేష్ట మూవీస్‌ను మొదటి, సుధాకర్ రెడ్డిని రెండు, నితిన్, నిఖితలను మూడు, నాలుగో నిందితులుగా పేర్కొన్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications