శివ,అంతయ్య కుటుంబాలకు ఆర్థిక సాయం.!మరో రెండు లక్షలు అందచేసిన మేయర్.!
హైదరాబాద్ : నగర శివార్లలో జరిగిన అత్యంత హృదయ విదారక ఘటన పట్ల జాతీయ మానవహక్కుల కమీషన్ స్పందించిన విషయం తెలిసిందే. వనస్థలిపురం పద్మావతి కాలనిలో గతవారం జరిగిన సంఘటనలో మరణించిన ఇద్దరు ప్రయివేటు కార్మికులకు ఒక్కొక్కరికీ మరో రెండు లక్షల రూపాయలను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి బుదవారం అందచేశారు.
జాతీయ సఫాయి కర్మచారి కమీషన్ సభ్యురాలు అంజనా పన్వార్ తో కలసి సైదాబాద్ లోని మేయర్ మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఈ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ లో పూడిక పనులు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళలో కాంట్రాక్టర్ తీయిస్తుండగా ఇద్దరు ప్రయివేటు కార్మికులు మరణించారని అన్నారు. మరణించిన శివ, అంతయ్య కుటుంబసభ్యులకు ఇప్పటికే 15 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందచేశామని విజయలక్ష్మి స్పష్టం చేసారు.

అంతే కాకుండా తన మేయర్ నిదుల నుండి మరో రెండు లక్షల రూపాయలను నేడు జాతీయ కర్మచారి సఫాయి కమీషన్ సభ్యురాలైన అంజనా పన్వార్ తో కలసి అందచేశామని తెలిపారు. ఈ ఇద్దరు కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయనున్నట్టు కలెక్టర్ కూడా స్పష్టం చేశారని తెలియచేసారు. జీహెచ్ ఎంసీ లో ఇక నుండి ఈ విధమైన దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విజయలక్ష్మి చెప్పారు. ఈ దురదృష్టకరమైన సంఘటనకు భాద్యులైన కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసి, అతనిని జైలుకు కూడా పంపినట్టు తెలియ చేసారు. అధికారులపై కూడా చర్యలు చేపట్టామని అన్నారు. కాగా, జాతీయ సఫాయి, కర్మచారి కమీషన్ సభ్యురాలైన అంజనా పన్వార్ బిఎన్.రెడ్డి కాలనీ సమీపంలోని పద్మావతి కాలనీకి వెళ్లి సంఘటన జరిగిన తీరుతెన్నులను పరిశీలించారు. ఇలాంటి సంఘటన జరగడం అత్యంత విచారకరమని అంజనా పన్వార్ అన్నారు.












Click it and Unblock the Notifications