రెస్టారెంటులో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: సికింద్రాబాద్ మారేడ్ పల్లిలోని గోకుల్ రెస్టారెంటులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వండగదిలో విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా వంటగదిలో దట్టమైన పోగలతో మోదలై మంటలు భవనం మోత్తనికి వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బయటకు పరుగులు తీసి, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రంగప్రవేశం చేసిన ఫైర్ సిబ్బంది, హోటల్ సిబ్బంది, స్థానికుల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే హోటల్ మొత్తం అగ్నికి ఆహుతైంది. రెస్టారెంటుకు తాళాలు వేసి ఉండడంతో మంటలను అదుపు చేయడానికి ఇబ్బందులు పడ్డారు అగ్ని మాపక సిబ్బంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్ వంట గదిలో నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వాటికి మంటలు వ్యాపించి ఉంటే పెను ప్రమాదం జరిగేది. భవనానికి ఫైర్ సేప్టి లేదని పైర్ అదికారి సుదర్శన్ తెలిపారు. రెస్టారెంట్ నిర్వహకులు ,భవన యజమానిపై చర్యలు తిసుకుంటామన్నారు. అయితే ఈ ఘటనలో ఆస్తి నష్టంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications