కత్రియా లో అగ్ని ప్రమాదం, ఆ సమయంలో యాభై మంది అక్కడే
నగరంలోని సోమాజీగూడలోని కత్రియా హోటల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి.
హైదరాబాద్ :హైద్రాబాద్ నగరంలోని కత్రియా హోటల్ లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ లోని నాలుగో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.ఈ మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పివేాయి.
కత్రియా హోటల్ లో మంగళవారం నాడు ఉదయం సంభవించిన అగ్నిప్రమాదం హోటల్ లో బసచేసిన వారిని ఇబ్బందిపెట్టింది. హఠాత్తుగా హోటల్ లో మంటలు వ్యాపిండడంతో బస చేసిన వారు భయాందోళనలకు గురయ్యారు.

హోటల్ లో బస చేసిన వారిని సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాలుగో అంతస్థులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఇతర అంతస్థులకు కూడ వ్యాపించాయి.
అయితే నాలుగు ఫైరింజన్లు మంటలకు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. సార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్థులో సుమారు 50 మంది బస చేశారు.












Click it and Unblock the Notifications