మాసబ్ ట్యాంక్‌లోని ఆదాయపన్ను శాఖ భవనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో బుధవారం ఆర్థరాత్రి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి ఆదాయపన్ను శాఖ బిల్డింగ్ ఎనిమిదో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి.
స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications