హైదరాబాద్‌: అర్ధరాత్రి కాల్పుల కలకలం, యువకుడికి తీవ్రగాయాలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. పీస్‌ కాలనీలో మన్సురాబాద్‌కు చెందిన ముస్తఫా అనే వ్యక్తిపై జుబేద్‌ అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ఇటీవల జుబేద్‌ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. అయితే, ఐటీ అధికారులకు ముస్తఫా సమాచారం ఇచ్చి ఉంటాడన్న అనుమానంతో జుబేద్‌ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. అతని వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు.

firing in Mailardevpally:one injured

నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ ముస్తఫా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముస్తఫా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితునికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

నిందితుడు, బాధితుడి మధ్య రియల్ ఎస్టేట్ గొడవలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పిలిచి మాట్లాడతామని చెప్పి ముస్తఫాపై కాల్పులు జరిపాడు జుబేద్. అతడు స్థానికంగా ఓ పార్టీ నాయకుడు కుమారుడని తెలిసింది. తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని జుబేద్‌పై ముస్తఫా గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man injured in firing incident in Mailardevpally, in Hyderabad on Friday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి