హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేబీఎస్ బ్యాంక్ సీఈఓపై కాల్పులు: డ్రైవర్ తమ్ముడే నిందితుడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్‌లోని విజయనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న కేబీఎస్ బ్యాంక్ సీఈఓ పానియాపై కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆయనపై కాల్పులు జరిపింది ఆయన కారు డ్రైవర్ తమ్ముడేనని పోలీసులు తేల్చారు. గత ఆదివారం బ్యాంక్ సీఈఓపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

 ఆస్పత్రిలో కోలుకుంటున్న బ్యంక్ సీఈఓ

ఆస్పత్రిలో కోలుకుంటున్న బ్యంక్ సీఈఓ

కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. కాగా, బాధితుడ్ని వెంటనే ఆస్పత్రి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

వేగంగా దర్యాప్తు

వేగంగా దర్యాప్తు

కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేగంగా దర్యాప్తు చేశారు. దీంతో నిందితుడు ఇంటిదొంగేనని తేలింది.

ఘటనా స్థలంలో బుల్లెట్

ఘటనా స్థలంలో బుల్లెట్

బ్యాంక్ సీఈఓ పానియాపై కాల్పులు జరిపింది ఆయన డ్రైవరేనని పోలీసులు తేల్చారు. అంతేగాక, కారు డ్రైవర్‌ను అదుపులోకి విచారిస్తున్నారు. డబ్బుల కోసమే నిందితుడు బ్యాంక్ సీఈఓపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

బ్యాంక్ సీఈఓ

బ్యాంక్ సీఈఓ

బ్యాంక్ సీఈఓ కావడంతో ఆయన దగ్గర ఎక్కువగా డబ్బు ఉంటుందనే ఆలోచనతో నిందితులు ఈ దోపిడీకి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి రివాల్వర్ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు బృందాలతో పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

English summary
Car driver has arrested in Firing on KBS bank CEO's case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X