కాలేయ మార్పిడి: సల్మాకు చాక్లెట్ తినిపించిన రామ్ చరణ్ భార్య (ఫోటోలు)
హైదరాబాద్: నాలుగున్నరేళ్ల చిన్నారి సల్మాకు అపోలో వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. ఎంతో క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటుంది. బుధవారం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మనీష్ సి. వర్మ తన బృందంతో కలిసి ఈ ఆపరేషన్ వివరాలను తెలియజేశారు.
హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ముజీబ్ దంపతుల కుమార్తెకు ఒకటిన్నరేళ్ల వయసు నుంచి ఆరోగ్యం క్షీణించింది. అన్నిరకాల పరీక్షల అనంతరం చిన్నారికి కాలేయ సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ప్రతి 14వేల మంది పిల్లల్లో ఒకరికి వచ్చే ఓటీసీ (ఆర్నితైన్ ట్రాన్స్ కార్బమైలేస్) వ్యాధితో చిన్నారి బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు.

చిన్నారికి కాలేయ మార్పిడి
ఇదో జన్యుపరమైన ఆరోగ్య సమస్య. దీనివల్ల కాలేయం ప్రోటీన్లను జీర్ణించుకోలేదు. దీంతో శరీరంలో అమ్మోనియా పరిమాణం పెరిగి విషతుల్యమై ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది. కేవలం కాలేయ మార్పిడి ఒక్కటే ఈ వ్యాధికి సరైన చికిత్స అని వైద్యులు తెలిపారు.

చిన్నారికి కాలేయ మార్పిడి
తల్లిదండ్రులు, కుటుంబ సబ్యుల్లో ఎవరి కాలేయం సరిపోకపోవడంతో జీవ్‌దాన్‌ను సంప్రదించారు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి కాలేయం లభించడంతో అందులో సగం తీసుకొని గత నెల 23న చిన్నారికి అమర్చారు. పెద్దవారితో పోల్చితే పిల్లల్లో కాలేయ మార్పిడి చాలా క్లిష్టమైన ప్రక్రియ.

చిన్నారికి కాలేయ మార్పిడి
అపోలో ఆసుపత్రి హైదరాబాద్‌లో దేశంలోనే అత్యుత్తమంగా సుమారు 97 శాతానికిపైగా కాలేయ మార్పిడిలను విజయవంతంగా చేసింది. అనుభవజ్ఞులైన వైద్యులు, అధునాతన పరికరాలు, సిబ్బంది సహాయంతో శస్త్ర చికిత్సను పూర్తి చేశామని వైద్యులు తెలిపారు.

చిన్నారికి కాలేయ మార్పిడి
ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అపోలో గ్రూపు ఆసుపత్రుల సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ ఉపాసన చిన్నారి సల్మాను అభినందించి, చాక్లెట్ తినిపించారు.












Click it and Unblock the Notifications