ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ రేపటినుండే.. 3రోజులపాటు వెరైటీ చేపల వంటకాలు; ఆస్వాదించండి!!

రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు పసందైన చేపల వంటకాలు ఘుమఘుమలాడనున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, అదే విధంగా మృగశిర కార్తె నేపథ్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను చేపలు, రొయ్యలతో చేసిన రకరకాల సాంప్రదాయ వంటలతో నిర్వహించనున్నారు.

ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఫిష్ బిర్యాని, చేపల పులుసు, చేపల వేపుడు ఇలా రకరకాల వంటలతో స్టాల్స్ ను ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు రుచి చూపించనున్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే అనేక కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉచిత చేప పిల్లల పంపిణీ చేసి మత్స్య పరిశ్రమ ప్రోత్సహిస్తున్నారు. మత్స్య సహకార సంఘాల ద్వారా చేపల ఉత్పత్తికి పాటుపడుతున్నారు.

 foodfestival-

ఇక చేపల ఉత్పత్తి తెలంగాణలో గణనీయంగా పెరిగిన కారణంగా ప్రజలలో చేపల ఉత్పత్తులపై అవగాహన పెంచడానికి, సాంప్రదాయ చేపల వంటకాలను పరిచయం చేయడానికి ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ప్రజలలో చేపల వినియోగం పెరగాలని ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జరగనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో ప్రజలు పెద్ద సంఖ్యలో రుచులను ఆస్వాదించాలని కోరుతున్నారు.

ఇటు వరంగల్ జిల్లాలోనూ రేపటి నుండి మూడు రోజులపాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా మత్స్య శాఖ అధికారి నరేష్ కుమార్ నాయుడు తెలిపారు. వరంగల్ జిల్లాలో 20 స్టాల్స్, హన్మకొండ జిల్లాలో 10 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ లోని ఓ సిటీ గ్రౌండ్స్, హన్మకొండలోని నేరెళ్ళ వేణుమాధవ్ ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్ లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రేపటి నుండి జూన్ 10 వ తేదీ వరకు 15 నుండి 20 వెరైటీల చేపలు, రొయ్యల వంటకాలను జిల్లా ప్రజలకు రుచి చూపించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జూన్ 8 నుండి జూన్ 10 వరకు పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఫిష్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు, ఈ ఫిష్ ఫెస్టివల్ లో వివిధ రకాల చేప ఉత్పత్తులు, వంటకాలు తయారు చేసి అమ్మనున్నట్లు పేర్కొన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చేపల పండుగ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+