నాలుగు నెలలుగా ఐదుగురు రేప్: గర్భం దాల్చిన యువతి

నాలుగు నెలలుగా 18 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. దాంతో ఆ యువతి గర్భం దాల్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నల్లగొండ: ఓ 18 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తూ వచ్చారు. దాంతో ఆమె గర్భం దాల్చింది. ఆ యువతికి పాక్షికంగా మతిస్థిమితం లేదని సమాచారం. నల్గగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో జరిగిన ఈ ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగు చూసింది.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యువతిని ఆమె సోదరుడు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతడి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. బాధితురాలు ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. డీఎస్పీ రాంగోపాల్‌రావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

Five persons raes girl for four months

బాధితురాలి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. తోడుగా ఉండాల్సిన సోదరుడు జీవనోపాధి కోసం నకిరేకల్‌కు వలస వెళ్లాడు. ఒంటరిగా మిగిలిన ఆ యువతి ఇంటి వద్దే ఉంటూ స్థానికంగా ఉన్న మేనత్త వద్ద ఉంటోంది. ఒంటరిగా ఉంటున్న యువతిపై ఒకరి తరువాత ఒకరు నాలుగు నెలలుగా గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు.

బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, బాధ్యులైన ఐదుగురి యువకులపై ఫోక్స్‌, అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల్లో ఒంటెపాక చిట్టిబాబు, గుడుగుంట్ల శ్రీనివాస్‌, గుర్రాల నవీన్, గుడుగుంట్ల మనోజ్‌ను అరెస్టు చేయగా, మరో నిందితుడు నకిరేకంటి సందీప్‌ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+