అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్- ఇక సమరమే...!

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. అధికార పార్టీ బీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అక్టోబర్ 6న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఒకే విడతలో 115 మంది అభ్యర్థులను ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ పోరులో ముందు వరసలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ తుది దశకు చేరింది. ఈ నెలాఖరులో తొలి విడత జాబితా ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ గడువు జనవరి 17తో ముగియనుంది. నాలుగు రాష్ట్రాలు (ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం)తో పాటుగా డిసెంబర్ 17లోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది.

Five states Election Schedule including Telangana likely to be released in October

అక్టోబర్ 6న షెడ్యూల్ ప్రకటన తర్వాత డిసెంబర్ తొలివారంలోనే ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం టీం తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తుది దశకు చేరింది. నవంబర్ 4న ఫైనల్ జాబితాను ప్రకటించనున్నారు. అక్టోబర్ 24 దసరా తర్వాత నామినేషన్లు, ఉపసంహరణ పూర్తి చేసి ప్రచారానికి సమయం ఇచ్చేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే లోక్‌సభ అభ్యర్థులను సిద్ధం చేసుకున్నారు. ఈసారి 3 కోట్లకు పైగా తెలంగాణ ఓటర్లు ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

బీజేపీ కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం ఉన్న ఏడుగురు లోక్‌సభ అభ్యర్థులు అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. అంబర్‌పేట్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ జిల్లా నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు బరిలో నిలవనున్నారు. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ అసెంబ్లీ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జి. లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు.

ఈటల రాజేందర్ గజ్వేల్ ఆయన సతీమణి జమున హుజురాబాద్‌ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ ఈసారి ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. కొడంగల్ నుంచి రేవంత్ పోరు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. బండి సంజయ్ కిషన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ప్రతీ సీటు, ప్రతీ ఓటు మూడు పార్టీలకు అత్యంత కీలకంగా మారుతున్నాయి. పట్టు కొనసాగించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ బీజేపీలకు నవ్ ఆర్ నెవర్‌గా ఈ ఎన్నికలు మారుతున్నాయి. దీంతో తెలంగాణలో అసలు పొలిటికల్ ఫైట్ మొదలైంది. పొలిటికల్ కౌంట్ డౌన్ బిగిన్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+