Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో 18 ఏళ్ల తర్వాత స్వదేశానికి ఐదుగురు తెలంగాణ వాసులు: కేటీఆర్ కృషి

ఉపాధి కోసం దుబాయ్​ వెళ్లి ఓ హత్య కేసులో ఇరుక్కుని 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తెలంగాణకు చెందిన ఐదుగురిని అక్కడి కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. దశాబ్దకాలంపాటు ఎదురుచూసిన వారి కుటుంబసభ్యులు ఆ వలస కార్మికులు సొంత ఊరికి చేరుకోవడంతో పండగ వాతావరణం నెలకొంది.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఐదుగురు ఉపాధి కోసం దుబాయ్​ వెళ్లారు. అయితే, ఊహించని విధంగా నేపాల్​‌కు చెందిన వాచ్​‌మెన్​ బహదూర్​ సింగ్​ హత్య కేసులో నేరస్థులుగా మారారు. ఈ కేసులో 10 మంది ఆరోపణలు ఎదుర్కోగా, తెలంగాణకు చెందిన ఈ ఐదుగురు అందులో ఉన్నారు. దీంతో తొలుత పదేళ్లు జైలు శిక్ష విధించిన దుబాయ్​ కోర్టు.. నేరం నిరూపణ కావడంతో ఆ శిక్షను 25 ఏళ్లకు పెంచింది.

Five Telangana residents Released From Dubai Jail Returned To India

ఈ విషయం మీడియా ద్వారా 2011లో కేటీఆర్​ దృష్టికి వెళ్లడంతో వారిని సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నం చేశారు. స్వయంగా నేపాల్‌​కు వెళ్లి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇచ్చి క్షమాభిక్ష రాయించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడంతో నిబంధనలు కఠినతరం కావడంతో జాప్యం జరిగింది. బాధితులకు అక్కడి భాష తెలియకపోవడం, ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులకు కేటీఆర్​ న్యాయ పోరాటం కోసం ఆర్థిక సహాయం అందించారు.

మరోసారి బాధితుడి అనారోగ్య కారణాలను చూపుతూ మాజీ మంత్రి కేటీఆర్​ ప్రయత్నించారు. వారి దీనస్థితిని గమనించిన అప్పటి మంత్రి కేటీఆర్​ క్షమాభిక్ష కింద విడిపించేందుకు ప్రయత్నించారు. ఎన్నో ప్రయత్నాల అనంతరం కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో వలస కార్మికులు స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా 6 నెలల క్రితం జగిత్యాల జిల్లా వాసి విడుదల కాగా, హన్మంతు ఇటీవల 17న ఇంటికి చేరుకున్నారు. 18 ఏళ్ల తర్వాత కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో సిరిసిల్ల, రుద్రంగి, కోనరావుపేట మండలాలకు చెందిన నలుగురు బుధవారం స్వదేశానికి చేరుకున్నారు.

చందుర్తి మండలానికి చెందిన నాంపల్లి వెంకటి కూడా త్వరలో రానున్నట్లు దుబాయ్​లో ఉన్న వారి స్నేహితులు తెలిపారు. బాధితుల తరఫున న్యాయవాది అనురాధ అహర్నిశలు కృషి చేశారని.. కేటీఆర్​ ఆర్థిక సహాయంతో పాటు తన వంతు ప్రయత్నాలు చేశారని బాధితులు తెలిపారు. కేటీఆర్ విమాన ఖర్చులు భరించి, స్వదేశానికి రప్పించారు. శంషాబాద్​ ఎయిర్‌​పోర్టులో బాధితులను కలిసిన వారి కుటుంబసభ్యులు ఆనందం వెల్లివిరిసింది. దీంతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+