చిన్నారిపై రేప్: అత్తను గొడ్డలితో నరికి చంపిన కోడలు

హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీ పహాడీషరీఫ్‌ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీంతో, చిన్నారి తల్లిదండ్రులు పహాడీషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

దొంగల బీభత్సం

హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌ శివార్లలో దొంగలు బీభత్సం సృష్టించారు.ఇంట్లో నిద్రిస్తున్నవారిపై మత్తుమందుజల్లి జాఫర్‌గూడ, ఇనాంగూడలో పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇళ్ల నుంచి నగలు, నగదు అపహరించారు. నాలుగు తులాలబంగారం, రూ. 20వేల నగదును దొంగలు అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Five year old girl has been raped by a man in Hyderabad

ఎస్ఐ ఆత్మహత్య

ఖమ్మం జిల్లా కల్లూరు ఏ ఎస్‌ఐ వెంకట్రావ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఒంగూరు మండలం మిట్టగూడలో దారుణం జరిగింది. అత్తను కోడలు వెంకమ్మగొడ్డలితో నరికి చంపింది. అత్తను కోడలు హత్య చేయడానికి భూ తగాదాలే కారణమని పోలీసులు అంటున్నారు. కోడలు వెంకమ్మను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

సెల్ చార్జింగ్ పెడుతూ యువకుడి మృతి

నల్గొండ జిల్లాలో సెల్ చార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. విషాదకర ఈ సంఘటన పెద్దవూర మండలం శిర్సనగండ్లలో చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+