భాగ్యనగరం సిగ్గుపడేలా.. ఆ వీడియోలతో బెదిరిస్తూ.. మరో బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్‌

హైదరాబాద్ మహానగరంలో సభ్య సమాజం సిగ్గుపడేలా వరుస షాకింగ్ అత్యాచార ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో బాలికలపై వేధింపులు, అత్యాచారాలు జరగడం భాగ్య నగర వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అమ్నీషియా పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఉదంతం తరువాత వరుసగా హైదరాబాద్లో మైనర్లపై అత్యాచారాలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. విశ్వ విఖ్యాత నగరంగా మారుతున్న హైదరాబాద్ కు ఈ అత్యాచార ఘటనలు మాయని మచ్చగా మారుతున్నాయి.

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం... బాలిక జీవితం నాశనం

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం... బాలిక జీవితం నాశనం

తాజాగా హైదరాబాద్ లో కార్ఖానా పరిధిలో చోటు చేసుకున్న అత్యాచార ఘటన భాగ్యనగరంలో బాలికల రక్షణ పై అనుమానాలకు కారణంగా మారింది. మరో బాలికపై ఐదుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడటం మరోమారు అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే కార్ఖానా పరిధిలో తాజాగా తన పరిధిలో ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం ఒ బాలిక జీవితాన్ని నాశనం చేసింది.

బాలిక పై గ్యాంగ్ రేప్ .. వీడియోలతో బెదిరింపు

బాలిక పై గ్యాంగ్ రేప్ .. వీడియోలతో బెదిరింపు

ఇన్ స్టాగ్రామ్ లో బాలికకు ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పడింది. బాలికతో స్నేహం పెంచుకున్న ఇద్దరు యువకులు ధీరజ్, రితేష్ లు నిదానంగా బాలికకు దగ్గరయ్యారు. 2 నెలల క్రితం ఒకసారి ఇద్దరూ కలిసి బాలికను హోటల్ కు రప్పించి, బాలికపై అత్యాచారం చేసి, ఇక ఆ సమయంలో వీడియోలను తీసి బాలికను నిత్యం బెదిరించడం ప్రారంభించారు. ఇక ఎప్పుడుపడితే అప్పుడు బాలికపై అత్యాచారం చేస్తున్నారు.

రెండు నెలలుగా అత్యాచారం.. సైకియాట్రిస్ట్ వద్ద అసలు విషయం వెలుగులోకి

రెండు నెలలుగా అత్యాచారం.. సైకియాట్రిస్ట్ వద్ద అసలు విషయం వెలుగులోకి

రెండు నెలలుగా ఆమె పై అత్యాచారం జరుపుతూ నరకం చూపిస్తున్నారు. ఇక ఇటీవల ఆ వీడియోలను ఇవ్వాలని బాలిక వారిపై ఒత్తిడి తీసుకురాగా, వీడియోలను ఇచ్చేస్తామని హోటల్ కి రావాలని పిలిచి తన మిత్రులతో సైతం బాలికపై రేప్ చేయించాడు. ఇక దీంతో బాలిక తీవ్ర మానసిక సంఘర్షణకు గురై ముభావంగా మారిపోయింది. బాలిక ప్రవర్తన తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లారు. ఇక మానసిక వైద్యుడికి బాలిక తన సమస్యంతా చెప్పుకుంది.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు..పోక్సో చట్టం క్రింద కేసు నమోదు

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు..పోక్సో చట్టం క్రింద కేసు నమోదు

బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలుసుకున్న తల్లిదండ్రులు మే 30 వ తేదీన కార్ఖానా పోలీస్ స్టేషన్లో బాలిక పై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఓ మైనర్ తో పాటు మరో ఇద్దరిని ఈ కేసులో అరెస్టు చేశారు. నలుగురిపై పోక్సో యాక్ట్ కింద కేసులు పెట్టిన పోలీసులు, అత్యాచారంలో పాల్గొన్న మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+