కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు యువకులు మృతి
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మార్కూర్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన యువకులంతా 20 ఏళ్లలోపే వారే కావడం గమనార్హం. మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.
హైదరాబాద్ నగరానికి చెందని ఏడుగురు యువకులు శనివారం కొండపోచమ్మ సాగర్‌కు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో అదుపుతప్పి డ్యాంలో పడి వీరంతా మృతి చెందినట్లు తెలిసింది. కాగా, మరో ఇద్దరు కోమరి మృగంక్, ఎండీ ఇబ్రహీం(17) సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతులు హైదరాబాద్ నగరానికి చెందిన దనుష్(20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)గా గుర్తించారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పండగ ముందు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.
మరోవైపు, కొండపోచమ్మ డ్యాంలో పడి ఐదుగురు యువకులు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications