వికటించిన పెళ్లి విందు.. 300 మందికి అస్వస్థత
నిర్మల్ : అప్పటివరకు ఆనందంగా ఉన్న పెళ్లిమంటపంలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. భైంసాలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన పెళ్లిలో పాయసం తిన్న దాదాపు మూడు వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. విందులో వడ్డించిన కొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మొదటి రెండు బంతుల్లో భోజనం చేసినవారు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

వాస్తవానికి తొలుత భోజనం చేసిన కొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించడంతో.. భోజనం తిన్న ఇతరులు తమకు ఏమికాకున్నా భయంతో ఆసుపత్రులకు క్యూ కట్టినట్లు సమాచారం. ఆ మేరకు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు బాధితులు. ఈ ఘటనలో అధికశాతం చిన్నారులు ఉండటంతో ఆందోళన ఎక్కువగా కనిపించింది.












Click it and Unblock the Notifications