కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పనికి ఆహారం పథకం: పైసలే రాకపాయే, 15 రోజుల్లో డబ్బులు ఎక్కడ?

ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ది పొందే కూలీలకు మాత్రం తిప్పలు తప్పటం లేదు.పని కల్పిస్తున్నారు గానీ కూలీలకు కనీస సౌకర్యాల కల్పనతో పాటుగా సకాలంలో డబ్బులు మాత్రం అందజేయటం లేదు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: గ్రామీణ ప్రాంతంలో నివసించే కూలీలకు స్థానికంగా 100 రోజుల పనిదినాలు కల్పించి వారు వివిధ ప్రదేశాలకు పనుల కోసం వలసలు పోకుండా నివారించే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం 2006లో ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

ఈ పథకం ద్వారా లబ్ది పొందే కూలీలకు మాత్రం తిప్పలు తప్పటం లేదు.. పని కల్పిస్తున్నారు గానీ కూలీలకు కనీస సౌకర్యాల కల్పనతో పాటుగా సకాలంలో డబ్బులు మాత్రం అందజేయటం లేదు. దాంతో రాను రానూ కూలీలు ఈ పనులపై అయిష్టత వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఉపాధి పని చేసిన కూలీకి 15 రోజుల్లో డబ్బులు ఇవ్వాలని నిబంధన ఉన్నా అది ఎక్కడా అమలుకు నోచటం లేదు.

 Food for work: labourers not get coolie

దాంతో పని చేసిన ప్రతి సారి కూలీలు డబ్బుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఐదు నెలలుగా వారికి వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా పడుగల కైనా డబ్బులు వస్తాయని ఆశతో అక్కడ ఇక్కడ అప్పులు చేసి కుటుంబ సభ్యులకు పండగకు కొత్త దుస్తులు కొనుగోలు చేశారు. మరి కొందరు కూలీలేమో రేపో, మాపో డబ్బులు అకౌంట్‌లో పడతాయి అప్పుడే కుటుంబ సభ్యులకు కొత్త దుస్తులు కొందామని ఎదురు చూశారు.. వారం రోజులుగా ఎదురు చూపులకు చివరకు కూలీలకు నిరాశే ఎదురైంది.

ఫలించని మంత్రి ప్రత్యేక చర్యలు

రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బతుకమ్మ, దసరా పండుగకు ఉపాధి కూలీల డబ్బులు ఇప్పించాలని చేసిన ప్రత్యేక చొరవ సైతం ఫలించలేదు. 15 రోజుల కిందట మంత్రి జూపల్లి దిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌ సిన్హాతో భేటీ అయి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి హామీ రెండో విడత బకాయి నిధులు రూ.250 కోట్లు పండగ లోపు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

 Food for work: labourers not get coolie

ఈ మేరకు కార్యదర్శి ప్రత్యేక చర్యలు తీసుకుని డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని జూపల్లి మీడియా సమావేశంలోనూ తెలిపారు. ేసిన ప్రయత్నం సైతం విఫలమవటంతో ఇక అధికారులు చేసేదేమీ లేక కూలీల ఎదుట ముఖం చాటేసి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఉపాధిహామీకి 2016-17 కు కేటాయించిన బడ్జెట్‌ రూ.90 కోట్లు కాగా ఇప్పటి వరకు కూలీలకు బకాయి పడిన రూ.7.05 కోట్ల వరకు ఉన్నాయి.

అంతా ఆన్‌లైన్‌లోనే నమోదు చేస్తున్నా కూలీలకు మాత్రం డబ్బుల పంపిణీలో మాత్రం ఆలస్యం కావటం పరిపాటిగా మారింది. పండుగకు డబ్బులు వస్తాయని ఇన్నాళ్లు అధికారులు చెబుతుండగా అక్కడా, ఇక్కడా అప్పులు చేసి పండగకు సరకులు కొనుగోలు చేసుకున్న కూలీలకు పండుగలకు డబ్బులు రాలేదని తెలిసి పండుగ తెల్లవారి తెచ్చిన అప్పులు ఎట్లా తీర్చాలో అని ఆవేదన చెందుతున్నారు.

English summary
Labourers not getting money under food for work scheme in Karimanagar district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X